చెన్నైలోని మధురై అంబసముద్రం ప్రాంతానికి చెందిన దీనాథాయిలాన్ సూర్యశివరాం అనే వ్యక్తి ఆన్‌లైన్ ద్వారా మూత్రపిండాలు కొనుగోలు చేస్తానంటూ ప్రచారం చేశాడు. అతని ప్రకటనను నమ్మిన కొందరు మూత్రపిండాలు విక్రయించడానికి ముందుకొచ్చారు. ముందుగా రూ. 15 వేలు చెల్లించి రిజిస్టర్ చేయించుకుంటేనే మూత్ర పిండాలు కొనుగోలు చేస్తానంటూ దీనాథయిలాన్ బురిడీ కొట్టించి లక్షల రూపాయలు కాజేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వివరించారు. ఇతడి మోసాలపై నిఘాపెట్టిన ఎస్వోటీ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఎంతమందిని మోసం చేశాడు, ఏ మేర డబ్బులు దండుకున్నాడు అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.
ఆన్‌లైన్ కిడ్నీ మోసగాడు అరెస్ట్ - kidny racket
మూత్రపిండాలు కొనుగోలు చేస్తానంటూ అంతర్జాలంలో ప్రకటనలిచ్చి లక్షల రూపాయలు కాజేసిన కేటుగాడు పోలీసులకు చిక్కాడు. మూత్రపిండాలు కొనాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ డబ్బులు దండుకున్న మోసగాడిని రాచకొండ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు.