హైదరాబాద్‌లో ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మలక్పేట హోల్ సేల్ మార్కెట్‌లో కిలో గ్రేడ్ వన్ ఉల్లి ధర 150 రూపాయలకు పైగా చేరింది. టోకు ధరల్లో వర్తకులు 170 వరకు విక్రయిస్తున్నారు. రెండో గ్రేడ్ ఉల్లి ధర 100 నుంచి 140 రూపాయల వరకు పలుకుతోంది.
సాధారణంగా మలక్‌పేట్ మార్కెట్‌కు 40 నుంచి 60 లారీల ఉల్లి దిగుమతి అవ్వగా... ప్రస్తుతం కేవలం 20 లారీలు మాత్రమే వస్తున్నట్లు హైదరాబాద్ ఆనియన్ అసోసియేషన్ తెలిపింది. ఈ స్థాయిలో ధరలను ఇప్పటి వరకూ చూడలేదని వ్యాపారులు చెబుతున్నారు. పెరిగిపోతున్న ధరలతో ఉల్లి కొనలేని పరిస్థితి నెలకొందని వినియోగదారులు వాపోతున్నారు.
ఇవీ చూడండి: జనం కంట కన్నీరు... ఎందుకీ 'ఉల్లి'కిపాటు?