ETV Bharat / state

సర్కారీ దవాఖానాల్లో రేయింబవళ్లూ వైద్యం.. పేదల్లో ఆత్మస్థైర్యం

రాజధానిలో ప్రభుత్వ పరిధిలోని కొవిడ్‌ ఆసుపత్రులు రోగుల పాలిట దేవాలయాలుగా మారాయి. ఒకవైపు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు భారీగా డబ్బు వసూలుచేస్తూ బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో.. కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ ప్రభుత్వ దవాఖానాలు పేద కరోనా రోగులను అక్కున చేర్చుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు పంపిస్తున్నాయి. నిత్యం వేలాది మందికి పరీక్షలు చేస్తూ.. అవసరమైన వారిని ఆసుపత్రుల్లో చేర్చుకోవడంతోపాటు మిగిలినవారికి ఔషధాలిస్తూ పంపిస్తున్నాయి.

Ongoing services in Hyderabad government hospitals
రేయింబవళ్లూ సర్కారు దవాఖానాల్లో కొనసాగుతున్న సేవలు
author img

By

Published : Jul 23, 2020, 6:12 AM IST

మహానగరంతో పాటు అనేక జిల్లాల నుంచి రోజూ వెయ్యిమందికి పైగా అనుమానితులు/ పాజిటివ్‌ వచ్చినవారు హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరుతున్నారు.

రాజధానిలో దాదాపు 25 ప్రైవేటు ఆసుపత్రుల్లో 2500 పడకలు ఉన్నాయి. అయినా అవి దొరకడం గగనం. కొన్ని ఆసుపత్రులు దోపిడీకి గురి చేస్తున్నాయని రోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

పేదలకు ప్రభుత్వ ఆసుపత్రులే ఆసరాగా మారాయి. వీటిలోనూ కొన్ని దవాఖానాల్లో తగిన వైద్యం అందడంలేదని కొందరు రోగులు ఆరోపిస్తున్నారు. అయితే వైరస్‌ విజృంభిస్తున్న వేళ ఇవీ లేకపోయి ఉంటే అనేకమంది ప్రాణాలకే ముప్పు వచ్చి ఉండేదని నిపుణులు చెబుతున్నారు.

గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌, ఛాతీ, ఆయుర్వేద, కింగ్‌కోఠి, నేచర్‌క్యూర్‌, సరోజినీదేవి ఆసుపత్రుల్లో కరోనా రోగులకు 3500 పడకలు ఉన్నాయి. మరో 1200 పడకలతో గచ్చిబౌలిలోని టిమ్స్‌ సిద్ధమైంది.

ఒక్క గాంధీలోనే 2వేల పడకలుంటే ఇప్పుడు 800 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. 719 మంది వైద్యులు రేయింబవళ్లూ వారి ప్రాణాలను కాపాడి ఇంటికి పంపిస్తున్నారు.

ఎక్కడెక్కడ ఎటువంటి సేవలందుతున్నాయంటే..

  • ఫీవర్‌ ఆసుపత్రిలో 190 పడకలున్నాయి. మొదట్లో అనుమానితులకు మాత్రమే సేవలుండగా ఇప్పుడు పాజిటివ్‌ రోగులనూ అక్కున చేర్చుకుంటోంది.
  • కింగ్‌కోఠిలో 350 పడకలున్నాయి. రోగులకు వైద్యం అందిస్తోంది. వందలమందికి పరీక్షలు చేస్తోంది.
  • ఛాతీ ఆసుపత్రి అనుమానితులను చేర్చుకుని పరీక్షలు చేయించి లక్షణాలను బట్టి వివిధ ఆసుపత్రులకు పంపిస్తోంది. ఔషధాలూ ఇస్తోంది.
  • అమీర్‌పేటలోని ప్రకృతి చికిత్సాలయంలో 300 పడకలున్నాయి. రోజూ 200 మందికి పరీక్షలు చేస్తున్నారు. ఆయుర్వేద ఆసుపత్రి 220 పడకలతో సేవలందిస్తోంది.
  • ఉస్మానియాలో 60 పడకలతో ఐసోలేషన్‌ ఉంది. పాజిటివ్‌ ఉన్నవారిని వివిధ ఆసుపత్రులకు పంపిస్తోంది. సరోజినీదేవి ఆసుపత్రీ రోగులకు సేవలందిస్తోంది.

అండగా ఉంటున్నాం:

నిత్యం 200 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు చేయిస్తున్నాం. 50మందికిపైగా పాజిటివ్‌ వస్తే వారందరికీ వైద్యం అందిస్తున్నాం. లక్షణాలు అధికంగా ఉంటే గాంధీకి, లేని పక్షంలో మావద్దే చికిత్స అందిస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వి తోడ్పాటుతో పూర్తిస్థాయి కొవిడ్‌ ఆసుపత్రిగా తీర్చిదిద్దబోతున్నాం.- డాక్టర్‌ శంకర్‌, ఫీవర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్

ఎంతమంది రోగులొచ్చినా:

ప్రతి రోజూ 250 మందికి కొవిడ్‌ పరీక్షలు చేసి పాజిటివ్‌ వచ్చిన వారిలో లక్షణాలను బట్టి గాంధీతోపాటు వివిధ ఆసుపత్రులకు పంపిస్తున్నాం. కొంతమందికి మా ఆసుపత్రిలో చికిత్స ఇస్తున్నాం. ఆక్సిజన్‌ సౌకర్యం ఉన్న పడకలు 300 వరకు ఉన్నాయి. - డాక్టర్‌ శంకర్‌, కింగ్‌ కోఠి ఆసుపత్రి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్

224 మంది చికిత్స పొందుతున్నారు

బుధవారం నాటికి 224 మంది పాజిటివ్‌ రోగులు మా ఆసుపత్రిలో ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చినా తిరస్కరించకుండా వెంటనే వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశాం. రోజూ రెండుపూటలా కషాయం ఇస్తాం. యోగా చేయిస్తున్నాం. దీనివల్ల అనేకమంది కోలుకుంటున్నారని మా పరిశీలనలో తేలింది. - డాక్టర్‌ మాలతీ శ్యామల, ప్రకృతి చికిత్సాలయం నోడల్‌ అధికారి

నిరంతరం వైద్య సహాయం

కరోనాతో ఆరోగ్యం విషమించి చేరిన వందలమంది రోగులను సంపూర్ణ ఆరోగ్య వంతులుగా చేశాం. 700 మందికిపైగా వైద్యులు సేవలందిస్తున్నారు. సీరియస్‌ ఉండి వైద్యం కోసం వచ్చినవారెవరినీ తిప్పి పంపకుండా చేర్చుకుని తోడ్పాటు అందిస్తున్నాం. కొంతమందికి ప్లాస్మా వైద్యం కూడా అందించాం. - డాక్టర్‌ రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

రోగులకు పూర్తి వైద్యం:

ప్రస్తుతం 110 మంది కరోనా అనుమానితులు, రోగులు మా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన మరో 110 పడకల్లో రోగులను చేర్చుకోడానికి సిద్ధంగా ఉన్నాం. గాంధీతోపాటు ప్రాథమిక, అర్బన్‌ ఆరోగ్య కేంద్రాల సిఫార్సుతో చేర్చుకుని పూర్తి వైద్యం అందిస్తాం. -డాక్టర్‌ పరమేశ్వర్‌ నాయక్‌, ఆయుర్వేద ఆసుపత్రి సూపరింటెండెంట్‌

95 శాతం రోగులతో నిండి ఉంది:

ఇప్పటికే వందలమంది రోగులకు చికిత్స అందించి ఇళ్లకు పంపాం. 105 పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యం ఉంటే మరో 16 పడకలకు వెంటిలేటర్‌ సౌకర్యం ఉంది. రోజూ 45 మందికిపైగా చేరుతున్నారు. 95 శాతం పడకలు రోగులతో నిండిపోయాయి. -డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌, ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,554 కరోనా కేసులు.. 9 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.