ETV Bharat / state

దిశకు మద్దతుగా రాజధానిలో కొనసాగుతున్న నిరసనలు

దిశ ఘటనను నిరసిస్తూ నగరంలో నిరసనలు కొనసాగుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పలు ప్రాంతాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు.

Ongoing protests in the capital in support of the direction
దిశకు మద్దతుగా రాజధానిలో కొనసాగుతున్న నిరసనలు
author img

By

Published : Dec 5, 2019, 11:56 AM IST

దిశ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ తెలంగాణ వీరశైవ లింగాయత్​ సమాఖ్య ట్యాంక్​బండ్​పై కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నలుగురు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం బస్వేశ్వరుడి విగ్రహం వద్ద గల దిశ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. చట్టంలో కఠినమైన శిక్షలు లేకపోవడం వలనే మానవ మృగాళ్లు రెచ్చిపోతున్నారన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

ప్యాట్నీలోనూ...
మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ప్యాట్నీలోనూ మక్తల ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చి మహిళలపై అత్యాచారాలకు పాల్పడే నిందితులకు వెంటనే ఉరిశిక్ష విధించాలని డిమాండ్​ చేశారు.

మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ... మహిళలకు స్వేచ్ఛ రాలేదని సామాజిక కార్యకర్త మక్తల జలందర్ పేర్కొన్నారు. నేటి సమాజంలో మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ భద్రత పట్ల మరిన్ని చర్యలు చేపట్టి పోలీసు వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

దిశకు మద్దతుగా రాజధానిలో కొనసాగుతున్న నిరసనలు

ఇదీ చూడండి : దిశపై అసభ్య ప్రచారం చేస్తున్న మరో యువకుడి అరెస్ట్

TG_Hyd_94_04_ Lingayaths Condolences Rally At Tankbund_Av_TS10005 Note: Feed Ftp Contributor: Bhushanam యాంకర్ : మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను హత్యలను నిరసిస్తూ... తెలంగాణ వీరశైవ లింగాయత్ సమాఖ్య హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. ఆనంతరం ట్యాంక్ బండ్ పై ఉన్న బస్వేశ్వరుడి విగ్రహం వద్ద జస్టిస్ ఫర్ దిశ చిత్ర పటానికి నివాళులర్పించారు. మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరుగుతున్నాయని... వీటికి కఠినమైన శిక్షలు లేకపోవడం వలనే మానవ మృగాళు రెచ్చిపోతున్నారని పేర్కొన్నారు. కఠినమైన చట్టాలను అమలు చేయాలని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేసారు. విజువల్స్.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.