ETV Bharat / state

మాంసం దుకాణాలపై కొనసాగుతున్న దాడులు - manikonda

ఖైరతాబాద్​, మణికొండ, బంజారాహిల్స్​ ప్రాంతాల్లోని పలు మాంసం దుకాణాలపై పశు సంవర్ధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఓ దుకాణాన్ని సీజ్​ చేశారు.

Ongoing attacks on meat shops in hyderabad
మాంసం దుకాణాలపై కొనసాగుతున్న దాడులు
author img

By

Published : May 5, 2020, 11:59 AM IST

హైదరాబాద్​ నగరంలోని మాంసం దుకాణాలపై పశు సంవర్ధక శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. సోమవారం ఖైరతాబాద్, మణికొండ, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని 8 మాంసం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న బంజారాహిల్స్ రోడ్​ నెంబర్ 11లోని టెండర్ కట్స్ మటన్ దుకాణాన్ని సీజ్​ చేశారు.

తాము తనిఖీ కోసం వెళ్లిన సమయంలో దుకాణం బయట నో మటన్ అని బోర్డు ఏర్పాటు చేశారని.. లోపలకి వెళ్లి పరిశీలించగా సుమారు 20 కిలోల మటన్ లభించిందని పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ బాబుబేరీ అన్నారు. ఆ మాంసం సైతం దుర్వాసన వస్తుందని వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ సందర్భంగా జంట నగరాల్లోని ప్రతి దుకాణం ఎదుట మటన్​ కిలో ధర 700 రూపాయలుగా పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేయాలని దుకాణ నిర్వాహకులకు సూచించారు.

ఇవీ చూడండి: ప్రతి ఉత్పత్తిపై ఓరియంటల్ ఇన్సూరెన్స్​: నిరంజన్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.