ఎర్రమంజిల్ భవనాల కూల్చివేతపై హైకోర్టులో వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ భవనాలు వారసత్వ కట్టడాల పరిరక్షణ పరిధిలోనే ఉన్నాయని సీనియర్ న్యాయవాది నళిన్ కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. హుడా చట్టంలోని నిబంధన తొలగించినప్పటికీ.. దాని స్థానంలో వచ్చిన నిబంధనలు ఎర్రమంజిల్ భవనాలకూ వర్తిస్తాయన్నారు. మాస్టర్ ప్లాన్లో ఎర్రమంజిల్ భవనాలు యథాతథంగా అదే జోన్లో కొనసాగుతున్నాయన్నారు. మాస్టర్ ప్లాన్లో మార్పులు, చేర్పులు చేయాలంటే నిర్దుష్టమైన విధానం అనుసరించాల్సిందేనని నిబంధనలు చెబుతున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. హెరిటేజ్ కమిటీ ఆమోదం లేకుండా వారసత్వ కట్టడాల జాబితాలో మార్పులు చేయడం కుదురదన్నారు. అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించిన పిటిషన్లపై బుధవారం కూడా హైకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి.
ఇదీ చూడండి: మాస్టర్ ప్లాన్ సమర్పించండి: హైకోర్టు ఆదేశం