ETV Bharat / state

రాష్ట్రంలో కరోనా తొలి కేసుకు రేపటితో ఏడాది

యావత్​ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కొవిడ్​ మహమ్మారి తొలి కేసు రాష్ట్రంలో నమోదై రేపటితో ఏడాది పూర్తి కావస్తోంది. కొవిడ్​ నిబంధనల మధ్య ఈ సంవత్సర కాలం ఎన్నో చేదు అనుభవాలతో గడిచిపోయింది. ఎన్నో స్వీయ రక్షణ ఏర్పాట్లను మానవాళికి పరిచయం చేసింది. శాస్త్రవేత్తల కృషితో మహమ్మారికి టీకాను సాధించాం. వ్యాక్సిన్​ వచ్చింది కదా అని నిర్లక్ష్యంగా ఉంటే మళ్లీ భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. అందుకే మళ్లీ ముప్పు.. వద్దే వద్దు, స్వీయ జాగ్రత్తలే.. శ్రీ రామ రక్ష అంటూ వైద్యాధికారులు సూచిస్తున్నారు.

one year for corona
తెలంగాణలో కరోనాకు ఏడాది
author img

By

Published : Mar 1, 2021, 7:44 AM IST

రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదై మార్చి 2(మంగళవారం)తో ఏడాది అవుతుంది. ఈ సంవత్సర కాలంలో కొవిడ్‌ అనేక పాఠాలు నేర్పింది. ఎన్నడూ ఎరుగని కొత్త అలవాట్లను సాధారణ జీవనంలో కచ్చితంగా ఆచరించేలా చేసింది. ముఖానికి మాస్కు లేకుండా బయటకు రావద్దని చెప్పింది. ఏది తాకినా చేతులు శుభ్రంగా కడుక్కోవాలని గుర్తుచేసింది. గుంపుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది. గడిచిన ఏడాదిలో ఇందులో కొన్ని పాటించారు. ఎక్కువ వదిలేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో అనేక మలుపులు చోటుచేసుకున్నాయి. ఫిబ్రవరి 27, 2021 నాటికి కేసుల సంఖ్య 2,98,807కు పెరిగింది. ప్రధానంగా గత మూడు నెలలుగా వైరస్‌ వ్యాప్తి నెమ్మదించింది. అయినా రెండో ఉద్ధృతి వస్తుందేమోననీ, యూకే వైరస్‌, దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌ విరుచుకుపడుతాయేమోననీ.. ఇలా పలు ఆందోళనలు వెంటాడుతూనే ఉన్నాయి.

మళ్లీ ముప్పు..

ఈ క్రమంలో గత ఏడాదిలో కొవిడ్‌ టీకా రావడం మరో అద్భుతమైన ఘట్టమే. కొద్దిరోజులుగా జీహెచ్‌ఎంసీలో, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, కరీంనగర్‌, సంగారెడ్డి, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్‌, తదితర జిల్లాల్లో స్వల్పంగా కేసుల నమోదులో పెరుగుదల కనిపిస్తోంది. అజాగ్రత్తగా ఉంటే మరోసారి వైరస్‌ తీవ్రత పునరావృతం అయ్యే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వీయ నియంత్రణ, టీకాలే మున్ముందు కొవిడ్‌ నుంచి రక్షణనిస్తాయని సూచిస్తున్నారు. గత ఏడాది కొవిడ్‌ నివారణకు చేపట్టిన చర్యలపై ఆరోగ్యశాఖ తాజాగా ప్రభుత్వానికి నివేదికను అందజేసింది.

one year for corona
నియంత్రణకు టీకా తప్పనిసరి

మెరుగైన చికిత్సతో..
ముందస్తుగా వ్యాధి నిర్ధరణ కావడంతో బాధితులకు త్వరితగతిన చికిత్స అందించడం, వ్యాప్తి పెరగకుండా ఐసొలేషన్‌ చేయడం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టడం వల్ల కొవిడ్‌ అదుపులోకి వచ్చిందని వైద్యశాఖ నివేదికలో తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తంగా 2,95,222 మంది కోలుకున్నారు. మొత్తం పాజిటివ్‌ల్లో కోలుకున్నవారు 98.80 శాతం కావడం విశేషం. ఈ విషయంలో జాతీయ సగటు 97.1 శాతంగా నమోదైనట్లు వైద్యవర్గాలు తెలిపాయి. దాదాపు 70 శాతంమందికి పైగా ఎటువంటి లక్షణాలు లేకుండానే కొవిడ్‌ పాజిటివ్‌లుగా నిర్ధారణ అవుతున్నారనేది గుర్తించారు.

one year for corona
గడిచిన ఏడాది కాలంలో కరోనా కేసులు, మరణాల పట్టిక

ఆగస్టులో రోజుకు సగటున 9.87 మంది చొప్పున మృతిచెందగా.. సెప్టెంబరులో సగటున 9.96 చొప్పున, నవంబరులో సగటున రోజుకు నలుగురి చొప్పున.. ప్రస్తుతం రోజుకు సగటున ఒకరు చొప్పున కొవిడ్‌తో మృతిచెందుతున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల్లో కరోనా మృతులు సగటున 0.54 శాతం ఉండగా.. ఈ విషయంలో జాతీయ సగటు 1.4 శాతంగా నమోదైంది.

ఇదీ చదవండి: నేటి నుంచి వృద్ధులకు కొవిడ్​ వ్యాక్సిన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.