సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ డీసీఎం వాహనం.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ద్విచక్ర వాహనదారుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు మౌలాలికి చెందిన ధన చారిగా పోలీసులు గుర్తించారు. డీసీఎం వాహనదారుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ఇవీ చూడండి: విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా