ETV Bharat / state

రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే లక్ష కరోనా పరీక్షలు: డీహెచ్‌‌

రాష్ట్రంలో 1100కు పైగా కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్​ కొనసాగుతుందని.. ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్​ శ్రీనివాసరావు వెల్లడించారు. గురువారం ఒక్కరోజే లక్ష కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామన్న ఆయన.. లక్షకుపైగా టీకాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

dh srinivasa rao on corona tests in telangana
రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే లక్ష కరోనా పరీక్షలు: డీహెచ్‌‌
author img

By

Published : Apr 9, 2021, 5:51 PM IST

Updated : Apr 9, 2021, 7:54 PM IST

రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో లక్ష కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్​ శ్రీనివాసరావు వెల్లడించారు. అదేవిధంగా లక్షకు పైగా టీకాలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రజల్లో కరోనాపై అవగాహన పెరిగిందన్నారు.

రాష్ట్రంలో 1100కు పైగా కేంద్రాల్లో వాక్సినేషన్‌ కొనసాగుతోందని డీహెచ్‌ తెలిపారు. ప్రస్తుతం 1,064 కేంద్రాల్లో యాంటీజన్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త జిల్లా కేంద్రాల్లో త్వరలోనే ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేస్తామని డాక్టర్​ శ్రీనివాసరావు వెల్లడించారు. రోజుకు 25 వేల ఆర్టీపీసీఆర్​ పరీక్షలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.

రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ మినహా అన్ని జిల్లాల్లో స్వైరో సర్వే చేపడామన్న డీహెచ్​.. స్వైరో సర్వే కోసం ఎన్‌ఐఎన్‌ని సంప్రదించినట్లు తెలిపారు. ఆరు నుంచి ఎనిమిది వారాల్లో సర్వే ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రులో ఉన్న సుమారు 10 వేల పడకల్లో 80 శాతం వరకు ఖాళీగానే ఉన్నాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్​ శ్రీనివాసరావు వెల్లడించారు.

ఇవీచూడండి: జీహెచ్ఎంసీ సిబ్బందికి 100 శాతం వ్యాక్సినేషన్‌

Last Updated : Apr 9, 2021, 7:54 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.