ETV Bharat / state

తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు - బాహుబలి గేటు తలుపులు తొలగింపు - SECRETARIAT ARCHITECTURAL CHANGES

రాష్ట్ర సచివాలయంలో స్వల్ప వాస్తు మార్పులు - బాహుబలి గేటును పూర్తిగా తొలగించిన అధికారులు - ప్రధాన గేటు తలుపులు తీసేసి తాత్కాలికంగా రేకుల ఏర్పాటు

Secretariat
Telangana Secretariat (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 18, 2024, 9:29 AM IST

Updated : Nov 18, 2024, 9:36 AM IST

Architectural Changes in Telangana Secretariat : తెలంగాణ సచివాలయంలో స్వల్ప వాస్తు మార్పులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సచివాలయం ప్రధాన గేట్లు, రోడ్లలో కీలక మార్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు వైపున ఉన్న బాహుబలి గేటుగా పిలిచే ప్రధాన ద్వారం తలుపులను ఆదివారం పూర్తిగా తొలగించారు. ఈశాన్యం గేటుకు తూర్పు వైపున ప్రధాన ద్వారం రానుంది. ఇందుకోసం ఇనుప గ్రిల్స్‌ను తీసేశారు. మిగతా గేట్లను యథావిధిగా ఉంచనున్నారు. డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉండడంతో ఆ లోపు వాస్తు మార్పులు పూర్తి చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

Telangana Secretariat
బాహుబలి ద్వారం తలుపులు తీసేసి ఆ ప్రాంతంలో రేకులు ఉంచిన అధికారులు (ETV Bharat)

సుమారు రూ.3 కోట్ల 20 లక్షలతో ప్రభుత్వం ఈ మార్పులు చేస్తోంది. సచివాలయానికి ప్రస్తుతం నాలుగు వైపుల ప్రధాన గేట్లు ఉన్నాయి. తూర్పు వైపు లుంబినీ పార్క్ ఎదురుగా ఉన్న బాహుబలి గేటు నుంచి మాజీ సీఎం కేసీఆర్ రాకపోకలు జరిపే వారు. ఆ గేటు నుంచి సచివాలయం లోపల ప్రధాన ద్వారం వరకు రాకపోకలు కొంతకాలంగా నిలిపివేశారు. ఆ మార్గంలోనే తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు చుట్టూ లాన్, ఫౌంటెయిన్లు ఏర్పాటు చేస్తున్నారు. నైరుతి, ఈశాన్య గేట్లను కలుపుతూ రోడ్డును నిర్మిస్తున్నారు.

పశ్చిమాన మింట్ కాంపాండ్ వైపున ఉన్న మూడో గేటును కొన్ని సందర్భాల్లో తక్కువగా ఉపయోగిస్తున్నారు. అటువైపు ఎలాంటి మార్పులు చేయడం లేదు. ప్రధాన రహదారి వైపు ఉండే సౌత్-ఈస్ట్ గేటు నుంచి సచివాలయం సిబ్బంది, సాధారణ ప్రజల రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్ అధికారులు ప్రస్తుతం ఈశాన్యం వైపు గేటును ఉపయోగిస్తున్నారు. ఆ గేటు పక్కనే మరో గేటు నిర్మించనున్నారు. ఒక గేటు నుంచి లోనికి వెళ్లి మరో గేటు నుంచి బయటుకు వేళ్లేలా ప్రణాళిక చేశారు.

తొలిసారి మార్పులు : సచివాలయం నిర్మాణం తరువాత ఇలా మార్పులు చేయడం ఇదే తొలిసారి. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పాత భవనాలను కూల్చి వేసి కొత్త సచివాలయాన్ని నిర్మించింది. 28 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ బిల్డింగ్​ను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడాది ఏప్రిల్ 30న ప్రారంభించారు. సెక్రటేరియట్​లో జరుగుతున్న ఈ వాస్తు మార్పులను బీఆర్​ఎస్ నేతలు తప్పుబడుతున్నారు.

సచివాలయంలో 'బాహుబలి'ని మూసివేయాలని నిర్ణయం

Last Updated : Nov 18, 2024, 9:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.