ETV Bharat / state

1.40 లక్షలమందికి 10 జీపీఏ!

పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.40 లక్షల మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. కొన్ని జిల్లాల్లో మొత్తం హాజరైన విద్యార్థుల్లో 30-45 శాతం మందికి 10 జీపీఏ దక్కింది. ఈసారి కరోనా కారణంగా పరీక్షల రద్దుతో ఎఫ్‌ఏలో వచ్చిన మార్కులను 100కి లెక్కించి ఆ ప్రకారం గ్రెడ్లు ఇచ్చారు.

1.40 లక్షలమందికి 10 జీపీఏ!
1.40 లక్షలమందికి 10 జీపీఏ!
author img

By

Published : Jun 23, 2020, 7:12 AM IST

పదో తరగతి ఫలితాల్లో ఈసారి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.40 లక్షల మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించినట్లు అధికారులు తేల్చారు. కొన్ని జిల్లాల్లో మొత్తం హాజరైన విద్యార్థుల్లో 30-45 శాతం మందికి 10 జీపీఏ దక్కడం విశేషం. పదో తరగతిలో ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎఫ్‌ఏ)కు ఒక్కో సబ్జెక్టులో 20 మార్కులు ఉంటాయి. మిగిలిన 80 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు.

ఈసారి కరోనా నేపథ్యంలో పరీక్షల రద్దుతో ఎఫ్‌ఏలో వచ్చిన మార్కులను 100కి లెక్కించి ఆ ప్రకారం గ్రేడ్లు ఇచ్చారు. అంటే ఎఫ్‌ఏలో ఒక సబ్జెక్టులో 20కి 18 మార్కులు వస్తే 100కి 90 మార్కులు వచ్చినట్లు పరిగణిస్తారు. అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వటం వల్ల అందరూ ఉత్తీర్ణులయ్యారు. 10జీపీఏ దక్కించుకున్న వారి సంఖ్యా ఈసారి లక్ష దాటింది. గత ఏడాది ఆ సంఖ్య కేవలం 8,600 మాత్రమే.

కొన్ని జిల్లాల పరిస్థితి..

* కరీంనగర్‌ జిల్లాలో 14,102 మందికి 6,446 మంది 10 జీపీఏ పొందారు. అంటే 46 శాతం మంది అన్ని సబ్జెక్టుల్లో ఏ1 గ్రేడ్‌ దక్కించుకున్నారు.

* నల్గొండ జిల్లాలో 20,571 మందికి 6,642 మంది 10 జీపీఏ దక్కింది. 32% మంది ఏ1 గ్రేడ్‌ సాధించారు.

* సిద్దిపేట జిల్లాలో 14,268 మందిలో 4,664 మంది 10 జీపీఏ సాధించారు. ఇది 32 శాతంతో సమానం.

* నిజామాబాద్‌ జిల్లాలో 23,515 మందిలో 7,394 మంది, కామారెడ్డి జిల్లాలో 12,724 మందిలో 2,749 మందికి 10 జీపీఏ దక్కింది.

* ఇక అత్యధిక విద్యార్థులు ఉండే హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో 10 జీపీఏ సాధించిన విద్యార్థులు దాదాపు 50 వేల మంది ఉంటారని అంచనా.

10 జీపీఏ దక్కాలంటే...

ఆరు సబ్జెక్టుల్లో ఏ1 గ్రేడ్‌ దక్కితే వారికి 10 గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌(జీపీఏ) వస్తుంది. ఏ1 గ్రేడ్‌ రావాలంటే హిందీలో 90, ఆపైన మార్కులు, మిగిలిన సబ్జెక్టుల్లో 91, ఆపైన మార్కులు సాధించాలి. ఏ1 దక్కితే ఆ విద్యార్థికి 10 పాయింట్లు ఇస్తారు.

ఆర్‌జీయూకేటీకి ప్రవేశాల చిక్కులు

ఏకంగా 1.40 లక్షల మందికి 10 జీపీఏ దక్కడంతో బాసరలోని ఆర్‌జీయూకేటీలో సీట్లకు భారీ పోటీ ఏర్పడనుంది. అక్కడ 1500 సీట్లు మాత్రమే ఉన్నాయి.

ఇవీ చూడండి: కర్నల్​ సంతోష్​బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.