ETV Bharat / state

గ్రేటర్ పోటీకి ఒక్కరోజే రెండొందల దరఖాస్తులు

author img

By

Published : Nov 16, 2020, 10:22 PM IST

గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్​ తరపున పోటీ చేసేందుకు పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. రెండు రోజులు సెలవు రావడంతో ఔత్సాహికులు గాంధీభవన్​కు పోటెత్తారు. ఒక్కరోజులోనే రెండొందల మంది దరఖాస్తులు అందజేశారని ఇన్​ఛార్జ్ కుమార్​రావు వెల్లడించారు.

One day two hundred applicatins came for congrees party greater electins
గ్రేటర్ పోటీకి ఒక్కరోజే రెండొందల దరఖాస్తులు

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ఒక్కరోజులోనే రెండొందల మంది దరఖాస్తులు సమర్పించారు. వరుసగా రెండురోజులు సెలవులు రావడంతో ఇవాళ గాంధీభవన్​కు ఔత్సాహికులు పెద్దఎత్తున తరలివచ్చారు. హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్లలో పోటీ చేసే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 18వ తేదీ వరకు అవకాశం కల్పించారు.

మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో భారీసంఖ్యలో ఆశావహులు వచ్చే అవకాశం ఉందని గాంధీభవన్​ ఇన్​ఛార్జ్ కుమార్​రావు తెలిపారు. గ్రేటర్ పరిధిలోని మల్కాజ్​గిరి, చేవెళ్ల, మెదక్, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్​ స్థానాలకు దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు గాంధీభవన్​ వర్గాలు వెల్లడించాయి. కొంతమంది దరఖాస్తుతో పాటు రుసుం కూడ చెల్లిస్తున్నారని కుమార్​రావు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:పోటీ చేసే అభ్యర్థులు పారదర్శకత పాటించాలి: పార్థసారథి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.