ETV Bharat / state

'కర్షకుల కష్టాన్ని కార్పొరేట్లకు కట్టబెడితే ఊరుకోం' - congress against central's agriculture bill

ఆరుగాలం కష్టపడి అన్నదాతలు పండించిన పంటను కార్పొరేట్లకు కట్టబెట్టే వ్యవసాయ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా మేడ్చల్ జిల్లా షాపూర్​నగర్​లో హస్తం పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

one crore signature collection against agriculture bill
కేంద్ర వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ
author img

By

Published : Oct 2, 2020, 3:29 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని షాపూర్​నగర్​లో ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా సంతకం చేశారు. ఈ సంతకాన్ని కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్రానికి పంపిస్తామని తెలిపారు.

రైతు పండించిన పంటలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్న వ్యవసాయ చట్టాన్ని అందరూ వ్యతిరేకించి కోటి సంతకాలు చేయాలని ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. మోదీ సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టంపై నోరువిప్పాలని, రైతులకు అన్యాయం చేసే ఈ చట్టాన్ని వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిర్బంధ వ్యవసాయ విధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.