ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా కోడూరులో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. బాధితురాలిని ఆసుపత్రికి తరలించేందుకు గాను అంబులెన్స్ వచ్చింది.
ఇంతవరకు బాగానే ఉన్నా... వాహనాన్ని చూడగానే భయంతో వృద్ధురాలు కుప్పకూలిపోయింది. వైద్యులు పరీక్షించి ఆమె మృతి చెందినట్లు నిర్ధరించారు. మృతురాలి కుటుంబసభ్యులు విదేశాల్లో ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి: గ్రేటర్‌లో కలవరపరుస్తోన్న కేసులు.. కొత్త ప్రాంతాల్లో అత్యధికం