ETV Bharat / state

అంబులెన్స్​ ఎక్కేలోపే ప్రాణం విడిచిన కరోనా బాధితుడు - covid deaths

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖలో కొవిడ్​తో ఓ వృద్ధుడు మరణించిన తీరు చూపరులను కలచి వేసింది. వైరస్ సోకిన అతను చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లేందుకు బయలుదేరాడు. అంబులెన్స్​ కూడా వచ్చింది. ఎక్కేందుకు ఇంటిబయటకు వచ్చిన వృద్ధుడు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.

old-man-died-with-carona-in-vishaka
అంబులెన్స్​ ఎక్కేలోపే ప్రాణం విడిచిన కరోనా బాధితుడు
author img

By

Published : Jul 24, 2020, 9:01 AM IST

ఆంధ్రప్రదేశ్​ విశాఖలోని అల్లిపురం యల్లపువారి వీధికి చెందిన ఓ వృద్ధుడికి బుధవారం సాయంత్రం కొవిడ్ నిర్ధరణ అయింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు అతనికి దూరంగా ఉన్నారు. ఆ వృద్ధుడిని గురువారం సాయంత్రం వరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. రాత్రి 7 గంటల సమయంలో అంబులెన్సు వచ్చింది.

వృద్ధుడు అంబులెన్స్ ఎక్కకుండానే తీవ్ర ఆయాసంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. శ్వాసకోస సమస్య తీవ్రం కావడంతో ఊపిరి అందక అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన చూపరులను కలచివేసింది.

ఇదీ చదవండి కొవాగ్జిన్ ప్రయోగానికి కేజీహెచ్​లో రంగం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.