పురాతన భవనం స్లాబు పెచ్చులు ఊడిపడి ఇద్దరు గాయపడిన ఘటన హబీబ్‌నగర్ ఠాణా పరిధి అప్జల్‌సాగర్‌లో జరిగింది. ప్రమాదంలో ఇంట్లో నిద్రిస్తున్న గోపాల్ యాదవ్, అతని భార్య స్వల్పంగా గాయపడ్డారు.
ఈ భవనానికి గతంలోనే జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ భవనంలో సుమారు 13 కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. సమాచారం అందుకున్న టౌన్ ప్లానింగ్ ఏసీపీ మాధవి, కార్పొరేటర్ మహమ్మద్ ఇక్బాల్ సంఘటన స్థలానికి చేరుకొని... అందులో నివసిస్తున్న కుటుంబాలను ఖాళీ చేయించారు.
ఇదీ చూడండి: అల్వాల్‌లో భాజపా ధర్నా.. నాయకుల అరెస్టు