ETV Bharat / state

గవర్నర్‌తో ముగిసిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి, అధికారుల సమావేశం.. ఆ అంశాలపై చర్చ - తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Governor
Governor
author img

By

Published : Jan 30, 2023, 8:03 PM IST

Updated : Jan 30, 2023, 8:57 PM IST

20:00 January 30

బడ్జెట్‌ సమావేశాలపై గవర్నర్‌తో చర్చించిన మంత్రి, అధికారులు

Telangana Budget Sessions 2023 : బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కసరత్తు కొనసాగుతోంది. గవర్నర్ ప్రసంగం ఉండాలన్న తాజా నిర్ణయం నేపథ్యంలో మంత్రులు, అ‍ధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే పుదుచ్చేరి పర్యటనకు వెళ్లిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోగా.. ఆ వెంటనే శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు రాజ్​భవన్​కు వెళ్లి గవర్నర్​ను కలిశారు.

ప్రగతిభవన్ నుంచి రాజ్​భవన్ వెళ్లి గవర్నర్ తమిళిసైతో సమావేశమయ్యారు. ఉభయ సభలో ప్రోరోగ్, తిరిగి సమావేశమయ్యేందుకు నోటిఫికేషన్, గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిఫారసు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి, అధికారులు తిరిగి ప్రగతిభవన్​కు వెళ్లారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగం ఉంటుందన్న ప్రభుత్వ నిర్ణయంతో సమావేశాల షెడ్యూల్‌లో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

Last Updated : Jan 30, 2023, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.