Roads over forested areas : రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల మీదుగా 181 రహదారుల నిర్మాణం జరగనుంది. ఇందులో జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు ఆర్‌అండ్‌బీవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటవీ, రోడ్లు భవనాల శాఖల సమన్వయ సమావేశం శనివారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో జరిగింది. ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరై ప్రాజెక్టుల వారీగా చర్చించారు.
రోడ్ల నిర్మాణానికి అటవీ అనుమతులు వేగంగా వచ్చేలా చేయడానికి సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. రాష్ట్ర పరిధిలో పూర్తిస్థాయి రోడ్ల అనుసంధానం, కొత్త జాతీయ రహదారులు, వ్యూహాత్మక కారిడార్ల నిర్మాణం వీలైనంత తొందరగా పూర్తికావాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
ఇదీ చదవండి: House permissions in villages: ఊళ్లో.. ఇళ్లు కట్టేదెలా..?