ETV Bharat / state

మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైన తెలంగాణ - ములుగు జిల్లాలో మహాశివరాత్రి ఏర్పాట్లు

Mahashivratri arrangements : రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలకు శైవాలయాలు ముస్తాబవుతున్నాయి. ఇప్పటికే ప్రధాన ఆలయాలన్నింటిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు రేపు ఉపవాసం ఉంటున్న వాళ్లంతా ఇవాళ మార్కెట్లకు పరుగులు తీయడంతో జిల్లాల్లోని పండ్ల మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి.

special arrangements for Mahashivratri
మహాశివరాత్రికి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
author img

By

Published : Feb 17, 2023, 2:24 PM IST

Mahashivratri arrangements : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మహాశివరాత్రి పర్వదినం సమీపించింది. పరమేశ్వరుని భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైనది ఈ పర్వదినం. శివరాత్రి పండుగ రోజున శివయ్య భక్తులంతా ఉపవాసం ఉంటారు. శివనామస్మరణ చేస్తూ రాత్రంతా జాగారం చేస్తారు. రేపు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలు ఇవాళే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉపవాసం, జాగారం చేయడానికి కావాల్సిన సామగ్రి ముందే తెచ్చి పెట్టుకుంటున్నారు.

ఖమ్మం జిల్లాలో : రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దు గ్రామమైన ఖమ్మం జిల్లా మధిరలో దక్షిణ కాశీగా పేరుందిన శ్రీమృత్యుంజయ స్వామి ఆలయం ఉంది. ఈ శివాలయం మహాశివరాత్రి జాతరకు సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగే వేడుకలకు రెండు రాష్ట్రాల్లోని సమీప గ్రామాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారని అధికారులు చెబుతున్నారు.

ప్రసిద్ధ కాశీలోని పుణ్యక్షేత్రాన్ని పోలినట్టుగా ఇక్కడ ఆలయం పడమర దిక్కుకు తిరిగి ఉండటం విశేషం. ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా కాశీలోని గంగా నదిలాగ ఈ దేవాలయంలో వైరా నది ప్రవహిస్తుంది. ఉత్తరం వైపున హిందూ స్మశాన వాటిక ఉంది. కడియాలయంలో మహాశివరాత్రి పర్వదినాన స్వామిని దర్శించుకుంటే సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్నట్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే జాతరకు ఏర్పాట్లు పూర్తి చేశారు

భక్తులకు ఆర్టీసీ ఆఫర్.. శివరాత్రి పండుగను పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి జాతర కోసం.. ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జగిత్యాల జిల్లా మెట్​పల్లి ఆర్టీసీ బస్టాండ్ నుంచి మొత్తం 40 ప్రత్యేక బస్సులను జాతర స్పెషల్ కోసం నడిపిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈసారి వేలాది మంది భక్తులు స్వామి వారి దర్శనానికి వెళ్తారన్న ఆలోచనతో ఆర్టీసీ అధికారులు భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక దృష్టి సారించారు.

ములుగు జిల్లాలో: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని మహాశివరాత్రి పురస్కరించుకుని రామప్ప దేవాలయంలో ఈనెల 18, 19, 20 తేదీల్లో ఉత్సవాలు నిర్వహించనున్నారు. భక్తులు ప్రశాంతంగా రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోనేందుకు భారీ గేట్లతో క్యూలైన్లు సిద్ధం చేశారు. ఆలయ ప్రాంగణంలో గార్డెన్లో ప్రధాన రోడ్లకు ఇరువైపులా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నారు.

మూడు రోజుల ఉత్సవంలో భాగంగా నిర్వహించే శివపార్వతుల కల్యాణం, రుద్రాభిషేకం, బలిహరణం, దీపోత్సవం, ప్రసాద వితరణ కార్యక్రమాల కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించడం కోసం కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి జిల్లాలోను భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఆనందంగా గడిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.