ETV Bharat / state

పాన్​కార్డు ఉంటేనే రుణం... డ్వాక్రా మహిళలకు షాక్​

DWCRA women: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలోని వెలుగు అధికారులు పాన్‌కార్డుల దందాకు తెరలేపారు. డ్వాక్రా మహిళలకు రుణం కావాలి అంటే పాన్‌కార్టు తప్పనిసరి అని మనిషికి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. గతంలో ఐడీ కార్డుకోసమని డబ్బులు వసూలు చేశారని ఇప్పటికీ ఐడీ కార్డులు తమకు అందించలేదని డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దాచేపల్లి పట్టణ రూరల్‌ పరిధిలో 1600 గ్రూపులు ఉన్నాయని ఈ మేరకు సుమారు 16లక్షలు వసూలు చేస్తన్నారని డ్వాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు.

DWCRA  women
DWCRA women
author img

By

Published : Dec 21, 2022, 6:55 PM IST

డ్వాక్రా మహిళలకు పాన్​కార్డు ఉంటేనే రుణం

Money From DWCRA Women: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలోని వెలుగు అధికారులు పాన్‌కార్డుల దందాకు తెరలేపారు. ప్రతి డ్వాక్రా గ్రూపులోని సభ్యులు కచ్చితంగా పాన్ కార్డు తీసుకోవాలని లేని పక్షంలో వి.వో.ఏ లు తెలుపడమే కాకుండా పాన్ కార్డులు లేకపోతే ఇబ్బందులు వస్తాయంటూ చెప్పుతున్నారని ఆయా డ్వాక్రా సంఘాల మహిళలు తెలిపారు. వెలుగు సిబ్బంది డ్వాక్రా సంఘాల నుంచి పాన్ కార్డు పేరుతో బలవంతంగా లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో సుమారు అక్షరాలా రూ.12 లక్షలు వసూలు చేయగా, ఈ సారి రూ.16 లక్షలు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు.

గ్రూపుకి వేయి చొప్పున వసూలు: ఇదంతా ఏ.పీ.ఎం చేయిస్తున్నారని ఆయన ఆదేశాల మేరకు వి.వో.ఎలు పాన్ కార్డ్ చేసే వ్యక్తిని వెంట పెట్టుకుని మరీ.. గ్రూపుల వద్దకి తిరిగి పాన్ కార్డు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. తమ వద్ద నుంచి గ్రూపుకి వేయి చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆయా సంఘాల మహిళలు తెలిపారు. పైగా తమకు ఎలాంటి సమస్య రాకుండా.. పాన్ కార్డ్ తీసుకునే ప్రతి మహిళ,తమ వద్ద పాన్ కార్డు తీసుకొనేందుకు తమకు ఎటువంటి ఇబ్బంది లేదని.. వారి ఇష్ట పూర్వకంగానే తీసుకుంటున్నట్లు ఒక పత్రంపై సంతకం పెట్టించుకుంటున్నారు.

1,600 గ్రూపులు: ఒక్క దాచేపల్లి పట్టణ, రూరల్ పరిధిలో మొత్తం సుమారు 1,600 గ్రూపులు ఉన్నాయి. ఒక్కో గ్రూపుకి వెయ్యి చొప్పున చూస్తే 16 లక్షలు వస్తాయి. ఈ పదహారు లక్షల్లో ఏ.పీ.ఎం, సీ.సీ లకు, వి.వో.ఎ లకు, పాన్ కార్డు చేసే వ్యక్తికి నుంచి ముడుపులు వెళ్తాయని డ్వాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు. లేకుంటే తీసుకోమని బలవంతం ఎందుకు చేస్తారని ఆరోపిస్తున్నారు. గతంలో సైతం ఐడి కార్డు పేరుతో గ్రూపుకి 750 చొప్పున సుమారు 1,600 గ్రూపుల వద్ద పన్నెండు లక్షలు వసూళ్లు చేశారన్నారు.

లోన్ తీసుకున్నా చెల్లించాల్సిందే: డ్వాక్రా గ్రూపు లోన్ తీసుకోవాలంటే ఆన్​లైన్​ చేసినందుకు సుమారు మూడు వేల రూపాయల వరకు ఇవ్వాల్సిందేనని, కంప్యూటర్ వర్క్ చేసే సంబంధిత అధికారి డిమాండ్ చేస్తున్నారని, లోన్ తీసుకున్నాక వి.వో.ఎలు రూ.లక్షకి వెయ్యి చొప్పున ఎన్ని లక్షల లోన్ వస్తే అన్ని వేలు ఇవ్వాల్సిందేనని, రెంటు పేరుతో గ్రూపుకి 1,000 చొప్పున ఇవ్వాలని లేకుంటే ఇబ్బందులు తప్పవని బెదిరిస్తున్నట్లు డ్వాక్రా మహిళలు వాపోతున్నారు. ఇప్పటికైనా పై అధికారులు పూర్తి స్థాయిలో విచారిస్తే నిజాలు బయటకి వచ్చే అవకాశం ఉందంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.