ETV Bharat / state

ఈఎస్​ఐ శ్మశాన వాటికలో అధికారులే అన్నీ తామై.. - ఈఎస్​ఐ ఆస్పత్రిలో కరోనా మృతుల దహన సంస్కారాలు

ఎలా బతికామన్నది కాదు... పోయినప్పుడు ఏడవడానికి అయినవాళ్లు... మోయడానికి నలుగురు లేని బతుకు ఎందుకురా అన్నారు పెద్దలు. కానీ విలయతాండవం చేస్తున్న కొవిడ్​ మహమ్మారి అయినవాళ్లను పొట్టన పెట్టుకున్నా కనీసం దహనసంస్కారాలు నిర్వహించలేని దుస్థితి. అలాంటి పరిస్థితికి నిదర్శనమే ఎర్రగడ్డలోని ఈఎస్​ శ్మశానవాటికలో కనిపిస్తోంది.

ddd
ddd
author img

By

Published : Apr 22, 2021, 3:59 PM IST

హైదరాబాద్​లోని ఈఎస్​ఐ శ్మశాన వాటికలో కరోనా మృతులకు అధికారులే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. చాలామందికి కనీసం కడచూపు దక్కని పరిస్థితి. కొందరైతే ఒకరిద్దరు బంధువులు మాత్రమే హాజరవుతున్నారు. అధికారులే తగు జాగ్రత్తలు పాటిస్తూ దహనసంస్కారాలు చేస్తున్నారు.

ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు 8కరోనా మృతదేహాలకు అధికారులు అంత్రక్రియలు నిర్వహించారు. వీరిలో ఒక మహిళ అంత్యక్రియలకు ఆమె కుమార్తె హాజరైంది. తన తల్లి దహనసంస్కారాలను వాట్సప్​వీడియో ద్వారా బంధువులకు చూపిస్తూ కన్నీటి పర్యంతమయ్యింది.

ఇదీ చూడండి: రాష్ట్రంలో ఆక్సిజన్​ కొరతను అధిగమిస్తాం: మంత్రి గంగుల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.