ETV Bharat / state

గోదావరి- కావేరీ నదుల అనుసంధానంపై అభ్యంతరాలు - గోదావరి- కావేరీ నదుల అనుసంధానం న్యూస్

గోదావరి- కావేరీ నదుల అనుసంధానంపై మెజార్టీ రాష్ట్రాలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. తమ అవసరాలు తీరకుండా, ప్రయోజనాలు నెరవేరకుండా నీటి తరలింపు సాధ్యం కాదని.. అందుకు సంబంధించి హామీ ఇచ్చాక ముందుకెళ్లాలని స్పష్టం చేశాయి. నీటి లభ్యతపై కేంద్ర జలసంఘానికి పంపి పరిశీలిస్తామన్న... జాతీయ జల అభివృద్ధి సంస్థ... సీడబ్యూసీ ఆమోదం తర్వాతే డీపీఆర్​ను రాష్ట్రాలకు ఇస్తామని తెలిపింది. వచ్చే నెల 15లోగా రాష్ట్రాలు తమ అభిప్రాయాలను.. లిఖిత పూర్వకంగా అందించాలని సూచించింది.

గోదావరి- కావేరీ నదుల అనుసంధానంపై అభ్యంతరాలు

author img

By

Published : Sep 19, 2020, 5:04 AM IST

అభ్యంతరాలు

గోదావరి నదిపై తెలంగాణలోని జనంపేట వద్ద ఆనకట్ట నిర్మించి... కావేరి నదిపై ఉన్న గ్రాండ్ ఆనకట్ట వరకు నీటిని తరలించి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడుకు నీటిని ఇచ్చేందుకు జాతీయ జల అభివృద్ధి సంస్థ ఓ పథకాన్ని తయారు చేసింది. పథకంపై భాగస్వామ్య రాష్ట్రాలతో ఎన్​డీడబ్యూఏ దృశ్యమాధ్యమం ద్వారా... సమావేశం నిర్వహించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్​ఘడ్... కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ఇంజినీర్లు, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు మురళీధర్, నాగేందర్ రావు... ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్ రాష్ట్ర జలవ్యవహారాల సలహాదారు వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు సమావేశంలో పాల్గొన్నారు.

డీపీఆర్​లోని ముఖ్యాంశాలు..

గోదావరి- కావేరీ అనుసంధానానికి సంబంధించిన డీపీఆర్​లోని ముఖ్యాంశాలు.. దానిపై రాష్ట్రాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు సమాధానాలను జాతీయ జల అభివృద్ధి సంస్థ అధికారులు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తమ అవసరాలు తీరాక మిగిలిన నీటిని తరలిస్తే ఎలాంటి అభ్యంతరం లేదన్న తెలంగాణ.. అయితే నీటి లభ్యత ఎంతన్నది లెక్కగట్టాల్సింది కేంద్ర జలసంఘం మాత్రమే అని స్పష్టం చేసింది. అన్ని అంశాలపైనా ముందుగా రాష్ట్రాలతో చర్చించాకే ముందుకెళ్లాలని.. కొత్త ఆయకట్టుకు ప్రయోజనం కలిగేలా ఉండాలని తెలిపింది.

వ్యత్యాసం..

నీటి లభ్యతపై గత నివేదికకు, ప్రస్తుత నివేదికకు వ్యత్యాసముందన్న ఆంధ్రప్రదేశ్... పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉన్నందున దిగువ ప్రాజెక్టులు, అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని తెలిపింది. ప్రస్తుత ప్రాజెక్టులతో పాటు భవిష్యత్ ప్రాజెక్టులకు ఇబ్బంది కారాదని.. ఇప్పటికే తాము చేపట్టిన గోదావరి-పెన్నా అనుసంధానాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది. కేటాయింపులకు అనుగుణంగా ప్రాజెక్టులను చేపడుతున్నామన్న ఛత్తీస్​ఘడ్.. తమ వాటా నుంచి గోదావరి-కావేరీకి నీరివ్వలేమని తేల్చిచెప్పింది.

గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌లోని ఆయకట్టుకు మళ్లిస్తున్నందున తమకు కృష్ణాలో అదనపు జలాలు కేటాయించాలని మహారాష్ట్ర కోరింది. గ్రాండ్ ఆనకట్టకు నీటిని మళ్లించి కావేరీ ఆయకట్టుకు నీరిస్తున్నందున.. కావేరీలో తమిళనాడు వాటా తగ్గించాలని కర్ణాటక విజ్ఞప్తి చేసింది. కావేరీకి నీటిని మళ్లిస్తున్నట్లు కాకుండా నీటి సౌకర్యం లేని ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రాజెక్టును మార్చాలని తమిళనాడు కోరింది. కావేరీలో తమ వాటాను పెంచాలని.. కేరళ, పుదుచ్చేరి విజ్ఞప్తి చేశాయి.

లిఖిత పూర్వకంగా..

రాష్ట్రాల అభ్యంతరాల నేపథ్యంలో నీటి లభ్యత అంశాన్ని కేంద్ర జలసంఘానికి పంపి పరిశీలన చేయిస్తామని.. సీడబ్ల్యూసీ ఆమోదం తర్వాతే డీపీఆర్​ను రాష్ట్రాలకు ఇస్తామని ఎన్​డీడబ్యూఏ తెలిపింది. అదనపు నీటి కోసం అన్ని రాష్ట్రాల నుంచి డిమాండ్లు ఉన్నందున.. రెండో దశలో పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది. మొదటి దశే ఎప్పటికవుతుందో తెలియని పరిస్థితుల్లో... రెండో దశ అంటే ఎలా అని కొన్ని రాష్ట్రాలు ప్రశ్నించినట్లు సమాచారం. ప్రాజెక్టుపై రాష్ట్రాలు తమ అభిప్రాయాలను వచ్చే నెల 15లోగా లిఖిత పూర్వకంగా పంపాలని జాతీయ జల అభివృద్ధి సంస్థ తెలిపింది.

ఇదీ చూడండి: రిజిస్ట్రేషన్ శాఖలో పదోన్నతుల కోసం కమిటీ ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.