తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ఆర్థిక విధానాలు అమలు చేస్తూ... కేంద్ర నిధులు దారి మళ్లిస్తోందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేయట్లేదని... కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వెల్లడించారు.
దిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో నిర్మలా సీతారామన్‌ను ఆయన కలిశారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఆర్థిక సంఘం ద్వారా అందిస్తున్న నిధులను... రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఫిర్యాదు చేశారు. ఆయుష్మాన్ భారత్ అమలు చేయట్లేదని సీతారామన్‌కు చెప్పినట్లు వెల్లడించారు. రైతులకు చెందిన ఫసల్ భీమాకు రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడం వల్ల వేలాదిమంది రైతులు లక్షల రూపాయల నష్టపరిహారం కోల్పోవాల్సి వచ్చిందన్నారు.
ఇదీ చూడండి: ప్రభుత్వం కరోనా రోగులకు విశ్వాసం కల్పించలేకపోతుంది: జీవన్‌రెడ్డి