స్టాఫ్ నర్సులకు పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్ కోఠిలోని డీఎంహెచ్ కార్యాలయం ఎదుట నర్సింగ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. 2017లో స్టాఫ్ నర్సింగ్ పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ.. 3000 పోస్టులకు నోటిఫికేషన్ వేసి పరీక్షలు నిర్వహించిందని పేర్కొన్నారు. పరీక్షలు జరిగి మూడేళ్లు దాటినా ఇంతవరకు ఉద్యోగాల కల్పన జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆరోగ్యశాఖ, ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు.
వేరే పని చేయలేక..
ఉద్యోగం రాక, వేరే పని చేయలేక... జీవనోపాధి ఎంతో ఇబ్బందిగా మారిందని విద్యార్థులు వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ బాధను అర్థం చేసుకుని ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. గేటు ముందు బైఠాయించడంతో.. ఆందోళనకారులను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: 'అధిక ఫీజులు వసూలు చేస్తే తిరిగి చెల్లించేలా ఆదేశాలు'