ETV Bharat / state

కరోనా కష్టకాలంలో నర్సుల పాత్ర అనిర్వచనీయం..! - telangana latest news

కనిపెంచిన అమ్మానాన్నలు, తోడబుట్టినవారు, కట్టుకున్నవారు, తాము కన్నవారూ దగ్గరకు రాని కొవిడ్‌ కాలమిది. అలాంటి పరిస్థితుల్లో వారు అన్నీ తామై అండగా నిలుస్తున్నారు. అమ్మలా అన్నం పెడుతున్నారు.. దిగులుగా ఉంటే స్నేహ హస్తం అందిస్తూ ఓదారుస్తున్నారు.. దాదాపు 8 గంటల పాటు పీపీఈ కిట్‌ ధరించి... ఒళ్లంతా తడిసి ముద్దవుతున్నా.. చెరగని చిరునవ్వుతో.. ఓర్పుతో సేవలందిస్తున్నారు. తమ తోటివారే వైరస్‌ బారినపడినా.. కొందరు కన్నుమూస్తున్నా.. చెక్కుచెదరని ధైర్యంతో విధులు నిర్వర్తిస్తున్నారు. వైద్యులు సూచించిన చికిత్సను రోగులకు పరిపూర్ణంగా అందిస్తూ.. 24 గంటలూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. మహమ్మారి విరుచుకుపడుతున్న ఈ ఆపత్కాలంలో రోగులకు ఎనలేని సేవలందిస్తోన్న ‘కనిపించే దేవతలు’ నర్సులపై ప్రత్యేక కథనం..

కొవిడ్‌ బాధితులకు అన్నీ తామై సేవలందిస్తున్న నర్సులు

author img

By

Published : May 18, 2021, 6:52 AM IST

సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో హెడ్‌ నర్సుగా సేవలందించిన సుజాత(36)కు గత నెల 22న కొవిడ్‌ సోకింది. ఏడు రోజులపాటు మహమ్మారితో పోరాడిన అనంతరం అదే నెల 29న తుదిశ్వాస విడిచారు. భర్త ఆరు నెలల కిందటే కాలేయ వ్యాధితో కన్నుమూశారు. ఒక్కగానొక్క కొడుకు(19) ఇప్పుడు ఒంటరిగా మిగిలాడు. నిలోఫర్‌ హెడ్‌ నర్సు స్వరూపారాణి, ఛాతీ ఆసుపత్రి హెడ్‌ నర్సు విక్టోరియా జయమణి కూడా కరోనాతో పోరాడుతూ తనువు చాలించారు. ఇలా ఇప్పటివరకు దేశంలో 86 మంది, రాష్ట్రంలో ఆరుగురు నర్సులు అసువులు బాశారు.

కొవిడ్ బాధితులకు అన్నీ తామై..

యుద్ధరంగంలో సైనికుల్లా..

బేతపూడి జూలియన్‌

కొవిడ్‌ విధుల్లో ఉన్న నిజామాబాద్‌ స్టాఫ్‌ నర్సు బేతపూడి జూలియన్‌కు వైరస్‌ సోకింది. ఆ సమయంలో తన ఆరేళ్ల బాబును దగ్గరకు తీసుకోకుండా 15 రోజుల పాటు దూరంగా ఉండడం నరకప్రాయమని చెప్పుకొచ్చారు జూలియన్‌. తన దగ్గరకు వస్తానని బాబు గుక్కపట్టి ఏడుస్తుంటే.. దగ్గరకు తీసుకొని లాలించలేని పరిస్థితి. గదిలో తలుపులేసుకొని కుమారుడి ఏడుపును వింటూ కళ్లనీళ్ల పర్యంతమయ్యానంటారామె. కుటుంబ సభ్యుల అండతో ఆమె త్వరగానే కోలుకున్నారు. యుద్ధరంగంలో సన్నద్ధమయ్యే సైనికుల్లాగే తామూ కొవిడ్‌ విధుల్లో అలుపెరుగకుండా పనిచేస్తున్నామంటున్నారు జూలియన్‌. ‘‘పీపీఈ కిట్‌ వేసుకున్న తర్వాత బాత్రూంకు కూడా వెళ్లలేని పరిస్థితి. అనేక మంది నర్సులు మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతున్నారు. పీరియడ్స్‌లో ఉన్నప్పుడైతే ప్రత్యక్ష నరకమే. శానిరీ ప్యాడ్స్‌ మార్చుకోవడానికీ వీలుండదు. కొవిడ్‌ రోగులు ‘మమ్మల్ని బతికించండి’ అంటూ చేతులు పట్టుకుని కన్నీటి పర్యంతమై వేడుకుంటున్నారు. మేం చికిత్స చేస్తుండగానే కన్నుమూస్తున్నారు. ఇటువంటివి చూస్తున్నప్పుడు గుండె తరుక్కుపోతుంది’’ అని ఆవేదన వెలిబుచ్చారు జూలియన్‌.

గౌరవంగా చూడండి..

-లక్ష్మణ్‌ రుడావత్‌

ప్రైవేటు ఆసుపత్రిలో ఆర్థోపెడిక్‌ సర్జరీ విభాగంలో పనిచేస్తున్న నేను అనేక మంది కొవిడ్‌ బాధితుల సర్జరీల్లో పాల్గొన్నాను. ముఖానికి మాస్కు, ఒంటిపై పీపీఈ కిట్‌ తీయకుండా గంటల తరబడి విధుల్లో ఉన్నా.. తుదకు రోగి కోలుకుంటే ఆ తృప్తి వేరుగా ఉంటుంది. నర్సులు తమ వృత్తిని దైవంగా భావిస్తుంటారు. అనేక మందిని కష్టకాలంలో రక్షిస్తుంటారు. కుటుంబాలను వదిలి దూరంగా ఉంటూ సేవలందిస్తున్నారు. అయినా నర్సులంటే కొందరికి చులకన భావం ఉంది. వారు సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తించాలి. గౌరవంగా చూడాలి.

-లక్ష్మణ్‌ రుడావత్‌, రాష్ట్ర నర్సింగ్‌ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్‌

భయమేసినా వెనుకడుగు వేయలేదు

షాహదా బేగం

గతేడాది కరోనా మొదలైన తొలినాళ్లలో ఏం జరుగుతుందోనన్న భయం వేసేది. అయినా పవిత్రమైన నర్సు వృత్తిని ఎంచుకున్న తర్వాత వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని నిర్ణయించుకున్నారు కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రి స్టాఫ్‌ నర్సు షాహదా బేగం. సహచర నర్సులు 20 మందికి పైగా కొవిడ్‌ బారినపడినా ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు. రోగులకు అవసరమైన మందులు, ఆహారం, నీరు, ఇతరత్రా అవసరాలు తీర్చడంలో ముందుంటున్నారు. ‘‘ఈ ఉపద్రవాన్ని ఎలాగైనా ఎదుర్కోవాల్సిందేనని ఒకరికొకరం ధైర్యం చెప్పుకొన్నాం. సహచర నర్సులు కొందరు మృతి చెందినప్పుడు మాత్రం భయం వేసేది. మనకు కూడా ఏమైనా అయితే.. కుటుంబమెలా? అని తలచుకుంటే ఒళ్లంతా జలదరిస్తుంది. విధుల్లో ఉన్నప్పుడు తిండి తినడం కూడా సాధ్యం కాదు. ఎంత కష్టమైనా వృత్తిపై ప్రేమతో అన్నీ భరిస్తూ ఇష్టంగా సేవలందిస్తున్నాం. నాకు ఇద్దరు బిడ్డలు. ఆసుపత్రి నుంచి తిరిగొచ్చాక ఇంట్లోనూ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఏడాది కాలంగా వారే అన్ని పనులూ చేస్తున్నారు. నా కుటుంబం సంపూర్ణ మద్దతు ఇస్తోంది’’ అని చెప్పారు షాహదా.

చుట్టుపక్కలవారి చూపులు వెంటాడుతుంటాయి..

సీహెచ్‌.సుజాత

గాంధీ ఆసుపత్రి స్టాఫ్‌ నర్సు సీహెచ్‌.సుజాత అమ్మానాన్నలిద్దరికీ పాజిటివ్‌ వచ్చింది. వృద్ధులైనా సకాలంలో చికిత్సతో కోలుకున్నారు. అయినా ఆమె విధులకు డుమ్మా కొట్టలేదు. ఆసుపత్రి నుంచి ఇంటికెళ్లిన ప్రతిరోజూ తన ద్వారా కుటుంబ సభ్యులకు కరోనా రాకూడదని భగవంతుడిని ప్రార్థిస్తుంటానని చెబుతున్నారు సుజాత. ఆసుపత్రి నుంచి తిరిగివస్తుంటే.. చుట్టుపక్కల వారు చూసే చూపులు ఇబ్బందిగా ఉంటాయంటున్నారు ఆమె. ‘‘కొవిడ్‌ రోగి ఆసుపత్రికి వచ్చినప్పటి నుంచి కోలుకొని తిరిగి వెళ్లేవరకూ అన్ని దశల్లోనూ మా పాత్ర కీలకం. మందులు, మంచినీరు, ఆహారం మొదలుకొని చివరికి ఫ్యాన్‌ తిరగకపోయినా మేమే దగ్గరుండి చక్కదిద్దాలి. పీపీఈ కిట్‌ వేసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌కు గురవుతున్నాం. మహిళలుగా మా ఇబ్బందులు మాకుంటాయి. తొలి దశలో ప్రభుత్వం క్వారంటైన్‌ సెలవులిచ్చింది. వసతి సౌకర్యం కల్పించింది. ఉచితంగా ఆహారం అందించింది. రెండో ఉధ్ధృతిలో క్వారంటైన్‌ సెలవులు ఇవ్వడం లేదు. మాపై పని ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి’’ అని కోరుతున్నారు సుజాత.

తోటివారు మహమ్మారి బారిన పడుతున్నా..

అలువాల యాకమ్మ

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి హెడ్‌నర్సు అలువాల యాకమ్మ 30 ఏళ్లుగా నర్సుగా సేవలందిస్తున్నారు. సహచర నర్సులు మహమ్మారి బారిన పడుతున్నా ఆమె వెరవలేదు. ఈ వృత్తిలో సేవలందించడం అదృష్టమే అంటారామె. ‘‘కొవిడ్‌ వార్డులో పనిచేస్తున్నప్పుడు పీపీఈ కిట్‌ వేసుకోవడం కష్టంతో కూడుకున్నది. పీపీఈ కిట్‌ సైజు నాకు సరిపోకున్నా ఎలాగోలా సర్దుబాటు చేసుకుంటున్నాను. మాకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం, గుర్తింపు కావాలి. ఆర్థికంగా 10 - 20 శాతం కాదు.. ఎంత ఇచ్చినా మా ప్రాణాల ముందు తక్కువే. మమ్మల్ని గుర్తిస్తే అదే ఎక్కువ తృప్తినిస్తుంది. ఇంటికొస్తే విడిగా గదిలో ఉండాలి. నేను వస్తున్నామని ముందుగానే సమాచారమిస్తాను. ఇంటికి వెళ్లేసరికి వేణ్నీళ్లు సిద్ధంగా పెడతారు. లోపలికి అడుగు పెట్టడానికి ముందే.. కావాల్సిన వస్తువులు, దుస్తులు అన్నీ పెట్టేసి కుటుంబ సభ్యులు వేరే గదిలోకి వెళ్తారు. నేను నా గదిలోకి వెళ్లాక వారు బయటకు వస్తున్నారు. నర్సులెందరో ఇటువంటివి నిత్యం ఎదుర్కొంటున్నారు’’ అని చెప్పుకొచ్చారు యాకమ్మ.

ఇదీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు పోగొట్టుకోవద్దు: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.