ETV Bharat / state

'టిమ్స్​కి అప్లై చేస్తే.. గాంధీకి పంపారు.. న్యాయం కావాలి.!' - డీఎంఈ ఆస్పత్రి ముందు నర్సుల ఆందోళన

కొవిడ్-19 చికిత్స నిమిత్తం కాంట్రాక్టు బేసిక్ స్టాఫ్ నర్స్​ల పోస్ట్​ల కోసం ఆన్​లైన్​లో దరఖాస్తులు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందంటూ... కోఠి డీఎంఈ వద్ద నర్సులు ఆందోళనకుదిగారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి గాంధీలో కాంట్రాక్ట్​ పద్ధతిలో తీసుకోవాలని డిమాండ్ చేశారు.

nurses-protest-at-directorate-of-medical-education-in-koti
'కాంట్రాక్ట్ బేసిక్​లో టిమ్స్​కి అప్లై చేస్తే... ఔట్​ సోర్సింగ్​లో గాంధీకి పంపారు'
author img

By

Published : Jul 6, 2020, 7:52 PM IST

టిమ్స్​ ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్స అందించేందుకు... కాంట్రాక్ట్ బేసిక్​లో నర్సుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా కొందరు అప్లై చేసుకున్నారు. ఈనెల 2న గచ్చిబౌలిలోని టిమ్స్​లో వారి సర్టిఫికెట్లను సైతం అధికారులు వెరిఫికేషన్ చేశారు. అనంతరం మీరు సెలక్ట్ అయ్యారంటూ మెసేజీలు కూడా పంపారు.

''తర్వాతా టిమ్స్​లో భర్తీలు అయిపోయాయి. కొందరిని గాంధీ ఆస్పత్రిలో ఉద్యోగాలు చేయాలని డీఎంహెచ్ఓ డైరెక్టర్ మాకు చెప్పారు. కానీ ఔట్ సోర్సింగ్ విధానంలో తీసుకుంటామని చెప్పలేదు. కాంట్రాక్ట్ బేసిక్​ మీదనే కదా పనిచేయాల్సింది పర్వాలేదు అనుకుంటూ నేడు గాంధీ ఆస్పత్రికి వెళ్లాం. కానీ అక్కడ సిబ్బందికి మా గురించి ఎలాంటి సమాచారం లేదు. తర్వాత ఆస్పత్రి సూపరింటెండెంట్ వచ్చి మమ్మల్ని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా తీసుకుంటామని ... జీతాలు కూడా ఎప్పుడొస్తాయో చెప్పలేమని చెప్పారు.''

- ఓ నర్సు ఆవేదన

'కాంట్రాక్ట్ బేసిక్​లో టిమ్స్​కి అప్లై చేస్తే... ఔట్​ సోర్సింగ్​లో గాంధీకి పంపారు'

యూనిఫాం కూడా తామే తెచ్చుకోవాలని చెప్పారని నర్సులు తెలిపారు. ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా తమ బాధ్యత కాదంటూ వ్యవహరించారు. ఆఫర్ లెటర్​ కూడా ఇవ్వలేదు. టిమ్స్​కి అప్లై చేసుకున్న మమ్మల్ని గాంధీకి ఔట్​సోర్స్​లో పంపడం ఎంతవరకు కరెక్ట్​ అంటూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం స్పందించి... తమకు నోటిఫికేషన్​లో తెలిపిన విధంగా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: 'మోదీ లద్దాఖ్ పర్యటన చైనాకు గట్టి హెచ్చరిక!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.