ETV Bharat / state

Road accidents in telangana 2021 : ఈ ఏడాదిలో రక్తసిక్తమైన రహదారులు.. పెరిగిన మరణాలు

Road accidents in telangana 2021 : రాష్ట్రంలో రోడ్లపై ప్రయాణం ప్రాణసంకటంగా మారుతోంది. వేగం కన్నా ప్రాణం మిన్న అని తెలిసిన వారంతా కూడా వేగంగా నడుతూనే ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. అతివేగం, అజాగ్రత్త వెరసి ఆయువును బలిగొంటున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా సరే... ఫలించకుండా ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.

Road accidents in telangana 2021 , accident report
ఈ ఏడాదిలో రక్తసిక్తమైన రహదారులు
author img

By

Published : Dec 31, 2021, 11:19 AM IST

Road accidents in telangana 2021 : రాష్ట్రంలో ఈ ఏడాది ప్రమాదాలతో రహదారులు రక్తసిక్తమయ్యాయి. ప్రాంతాలతో తేడా లేకుండా నారాయణపేట నుంచి ఆదిలాబాద్ వరకు, కొత్తగూడెం నుంచి కామారెడ్డి వరకు రోడ్లపై ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి. పోలీసులు స్పీడ్ లేజర్‌ గన్​లతో నిఘా పెంచారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు వేసినా... డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు పెంచినా ఆశించిన ఫలితాలు కనిపించలేదు.

రహదారులు రక్తసిక్తం

తెలంగాణలో ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే సగటున పది శాతం పెరుగుదల నమోదైనట్టు గణాంకాల్లో తేలింది. ఈ క్రమంలో ప్రమాదాల్లో మరణాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 29 పోలీస్ యూనిట్లకుగాను 5 యూనిట్లలో మాత్రమే కొద్దిగా తక్కువ గణాంకాలు నమోదయ్యాయి. ఈ ఏడాది నవంబరు నాటికే 6,651 మరణాలు సంభవించగా... ఇప్పటివరకు ఆ సంఖ్య ఏకంగా 7 వేలు దాటడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గత అయిదేళ్లలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. తెలంగాణ రోడ్డు భద్రత విభాగం విశ్లేషణ ప్రకారం మితిమీరిన వేగం, మద్యం మత్తు, అధికవేగం ప్రధాన కారణాలని తేలింది.

జిల్లాల వారీగా ప్రమాదాలు

నల్గొండ జిల్లా అంగడిపేటలో ఆటో రిక్షా, కంటెయినర్ ఢీకొని 9 మంది మరణించిన దుర్ఘటనలో ఆటోడ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు బయటపడింది. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడడం కూడా మరణాల పెరుగుదలకు కారణమైంది. రహదారుల్లో లేన్ డిసిప్లేన్ పాటించడంలో వాహనదారులు విఫలం కావడం మరో కారణం. మహబూబాబాద్ జిల్లాలో ప్రమాదాలతోపాటు మరణాలూ 49 శాతం చొప్పున పెరిగాయి. మరణాలపరంగా... సిరిసిల్లలో 36 శాతం, నిర్మల్​లో 26 శాతం , వరంగల్​లో 25 శాతం పెరిగాయి. మహబూబ్​నగర్​లో గతేడాది కంటే ఈసారి మరణాలు 10 శాతం తగ్గాయి. భూపాలపల్లిలో 6 శాతం, రామగుండం, ములుగుల్లో 4 శాతం చొప్పున, రాచకొండలో 2 శాతం తగ్గిపోయాయి. 2020 నవంబరు నాటికి ఘోర ప్రమాదాలు 5,656... మరణాలు 6,033 జరిగాయి. ప్రమాదాలను నియంత్రించేందుకు పోలీసులు కృషి చేస్తున్నప్పటికీ వాహనదారుల తీరు మారకపోవడంతో ప్రమాదాలు అధికమవుతున్నాయి.

సైబరాబాద్​లో కాస్త తక్కువే..

Road Accidents in Cyberabad 2021 : ఐటీ కారిడార్​తో పాటు... భారీ నిర్మాణాలు, ఇతర పరిశ్రమల సమాహారం సైబరాబాద్ కమిషనరేట్. బాహ్య వలయ రహదారితో పాటు... జాతీయ రహదారి విస్తీర్ణం సైతం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా ఉంది. ఉద్యోగ, ఉపాధి, విద్యావకాశాల కోసం రహదారులపై నిత్యం లక్షల వాహనాలు తిరుగుతుంటాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, మద్యం సేవించి వాహనాలు నడపడం, మోటారు వాహనాల చట్టాన్ని అతిక్రమించడం వల్ల రహదారిపై నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారి ప్రమాదాల వల్ల ప్రాణ నష్టంతో పాటు.... ఇతర సమస్యలు ఏర్పడుతున్నాయి. వీటి పట్ల సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రమాదాల నియంత్రణ కోసం అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఫలితంగా ప్రాణ నష్టం తగ్గుతోంది. పూర్తి స్టోరీ కోసం క్లిక్ చేయండి.

ఇదీ చదవండి: Accidents on NH 167: ప్రమాదాలకు నిలయంగా ఎన్​హెచ్ 167.. అవే ప్రధాన కారణాలు.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.