ETV Bharat / state

నుమాయిష్​కి వెళ్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం ఇంపార్టెంట్​!​ మిస్​ కావొద్దు! - Numaish Exhibition 2024

Numaish Exhibition 2024 Timings and Rules: భాగ్యనగర వాసులను అలరించేందుకు నుమాయిష్​ ప్రారంభమైంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఈ ఎగ్జిబిషన్​ జరగనుంది. ఈరోజు నుంచి సందర్శకులను అనుమతించనున్నారు. ఈ క్రమంలో తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2024, 12:34 PM IST

Numaish Exhibition 2024 Timings and Rules: తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లో సంద‌ర్శించేందుకు ఎన్నో ప్ర‌దేశాలున్నాయి. చారిత్ర‌క క‌ట్ట‌డాలు మొద‌లుకుని పురాత‌న ఆల‌యాలు.. ఇంకా ఎన్నో ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్ట‌ుకుంటాయి. అంతే కాకుండా ఎన్నో ఎగ్జిబిష‌న్లు కూడా ప్రజలను అలరిస్తున్నాయి. అందులో ముఖ్యంగా నాంపల్లిలో నిర్వహించే నుమాయిష్​కు ప్రత్యేక ప్లేస్​ ఉంది. ఈ ఏడాది జనవరి1 నుంచి ఈ ఎగ్జిబిషన్​ ప్రారంభమైంది. అసలు దీని చరిత్ర ఏంది..? ఎన్ని స్టాల్స్​ ఉన్నాయి..? టైమింగ్స్​ ఏంటి..? ఎంట్రీ ఫీజు ఎంత..? తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఈ టాప్​-10 టిప్స్​ మీ కోసమే!

ఇదీ చరిత్ర: ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నేతృత్వంలో మొదటిసారి 1938వ సంవత్సరం నాంపల్లి పబ్లిక్ గార్డెన్​లో 10రోజుల పాటు అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్​) ప్రారంభమైంది. ఆ తర్వాత 1946లో నాంపల్లి మైదానంలోని 26 ఎకరాల సువిశాల స్థలంలో నిర్వహించారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం రావడం, 1948లో హైదరాబాద్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కావడంతో ఈ రెండేళ్లు నుమాయిష్‌ ఏర్పాటు చేయలేదు.

1949లో తిరిగి నాంపల్లి మైదానంలోనే ప్రారంభమైంది. అప్పుడు నుమాయిష్‌ పేరును ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌గా మార్చారు. అప్పటి నుంచి 2020 వరకు విరామం లేకుండా ఏటా నుమాయిష్‌ దిగ్విజయంగా కొనసాగింది. కానీ, మధ్యలో కరోనాతో మళ్లీ విరామం పడింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభమైంది.

ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా నిర్వహిస్తున్న 'నుమాయిష్' కార్యక్రమానికి దేశ, విదేశాల్లో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తయారు చేసిన ఉత్పత్తులకు విస్తృత ప్రచారం లభించడం సహా, వాటి విక్రయాలకు సైతం ఈ ఈవెంట్ కేంద్రంగా నిలుస్తోంది. ప్రతి ఏడాది దాదాపు 25 లక్షల మంది సందర్శకులు ఎగ్జిబిషన్​ను సందర్శిస్తారు.

సైబర్‌ మోసానికి గురయ్యారా? సింపుల్​గా కంప్లైంట్​ చేయండిలా!

వందల సంఖ్యలో స్టాల్స్​..: 'నుమాయిష్' ఎగ్జిబిషన్ లో అన్ని రకాల వస్తువులు ఒకే చోట లభ్యమవుతాయి. నగరంలో దొరకని పలు రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులు తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయి. కశ్మీరి నుంచి కన్యాకుమారి వరకు లభించే ప్రతి ఒక్కటీ(దుస్తులు, మంచాలు, కిచెన్ సామాగ్రి, కశ్మీరీ డ్రై ఫ్రూట్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, కొత్త తరహా ఫర్నీచర్స్, మల్టీ పర్పస్ ఉపకరణాలు) అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ స్టాల్స్, ఫుడ్ కోర్టులు, సందర్శకులను అలరించేందుకు అమ్యూజ్మెంట్ పార్క్ ఇలా అన్నీ ఎగ్జిబిషన్ లో కొలువుదీరాయి. ఈసారి మొత్తం 2,400కు పైగా ఎగ్జిబిటర్లు వచ్చారు.

టైమింగ్స్​: ఈ నుమాయిష్ సాధారణ రోజుల్లో రోజూ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యి రాత్రి 10.30 వరకూ ఉంటుంది. అదే వీకెండ్స్, హాలిడేస్​లో మాత్రం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటల వరకూ ఉంటుంది. ఇకపోతే గత సంవత్సరంలాగే.. ఈ ఏడాది కూడా నుమాయిష్ ఎంట్రీ ఫీజు రూ.40గా ఖరారు చేశారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే.. మాస్క్ లేకపోతే ఎగ్జిబిషన్​కు ఎంట్రీ లేదని స్పష్టం చేశారు.

ఆ రెండు రోజులు స్పెషల్​: మరో విషయం ఏంటంటే, ఈ సంవత్సరం జనవరి 9న లేడీస్ డే నిర్వహిస్తున్నారు. ఆ రోజు మహిళలకు నుమాయిష్‌లో ఫ్రీ ఎంట్రీ ఉంది. అలాగే జనవరి 31న చిల్డ్రన్స్ డే పేరుతో పిల్లలకు నుమాయిష్ ఫ్రీ ఎంట్రీ పెడుతున్నారు. అలాగే ఈసారి మాంసాహార రెస్టారెంట్లతోపాటూ, శాఖాహార రెస్టారెంట్లు కూడా ఏర్పాటు చేశారు. వినోదాత్మకమైన పలు విభాగాలు అందుబాటులో ఉంటాయి. అలాగే ఎగ్జిబిషన్​కు వచ్చే సందర్శకుల కోసం ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మహిళా పారిశ్రామికవేత్తలకు సిడ్బీ ప్రోత్సాహకాలు

Hyderabad Metro News: నుమాయిష్‌ రద్దీ.. హైదరాబాద్‌ మెట్రో వేళల్లో మార్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.