ETV Bharat / state

NTR TRUST : కరోనా బాధితులకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్ - ఎన్టీఆర్ ట్రస్ట్ వార్తలు

కరోనా బాధితుల‌కు ఆన్ లైన్ లో ఉచిత వైద్య సేవ‌ల ప్రక్రియ‌ను ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రారంభించింది. జూమ్ కాల్ ద్వారా డాక్టర్లు వైద్య స‌హాయం అందించారు. కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న కార‌ణంగా నేటి నుంచి రోజుకు 1000 మందికి టెలిమెడిసిన్ ద్వారా వైద్య సాయం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

NTR TRUST
ఎన్టీఆర్ ట్రస్ట్
author img

By

Published : Jan 21, 2022, 11:13 AM IST

Updated : Jan 21, 2022, 2:32 PM IST

కరోనా బాధితుల‌కు ఆన్​లైన్​లో ఉచిత వైద్య సేవ‌ల ప్రక్రియ‌ను ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రారంభించింది. తొలి రోజు 360 మంది కొవిడ్ బాధితుల‌కు జూమ్ కాల్ ద్వారా డాక్టర్లు వైద్య స‌హాయం అందించారు. రెండు గంట‌ల పాటు జ‌రిగిన జూమ్ మీటింగ్ ద్వారా బాధితులు డాక్టర్ల నుంచి ప‌లు సూచ‌న‌లు పొందారు. రోగుల ఆరోగ్య ప‌రిస్థితి, ల‌క్షణాల ఆధారంగా మందులు, ప‌రీక్షలు చేయించుకోవాల‌ని సూచించారు. వైద్య సేవ‌ల‌తో పాటు పలు చోట్ల రోగుల‌కు మందులు పంపిణీ చేశారు. కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న కార‌ణంగా నేటి నుంచి రోజుకు వెయ్యి మందికి టెలిమెడిసిన్ ద్వారా వైద్య సాయం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

తెలుగు దేశం పార్టీ వ‌ర్గాల ద్వారా జూమ్ కాన్ఫరెన్స్ లింక్​ను ప్రజ‌ల‌కు అందేలా ఏర్పాట్లు చేశారు. రోజూ ఉద‌యం ఏడున్నర గంట‌ల నుంచి టెలిమెడిసిన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవ‌లకు కొంద‌రు త‌మ వంతు తోడ్పాటు అందిస్తున్నారు. తెలుగు దేశం పార్టీ వైద్య విభాగం అధ్యక్షుడు శివ‌ప్రసాద్ 5 వేల మందికి మందులు అందించేందుకు ముందుకు వ‌చ్చారు. తొలి రోజు కొవిడ్ రోగుల‌కు అందిన స‌హాయంపై ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువ‌నేశ్వరి సమీక్షించారు. అద‌నంగా డాక్టర్లు, సిబ్బందిని నియ‌మించుకుని ఎక్కువ మంది రోగుల‌కు స‌హాయ ప‌డేలా ప్రణాళిక సిద్ధం చేసిన‌ట్లు ఆమె ప్రక‌టించారు.

ఇదీచదవండి. Hospital Charges For Covid Treatment : కాక్‌టెయిల్‌ పేరు చెప్పి ఆస్పత్రుల దోపిడీ

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 21, 2022, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.