ETV Bharat / state

'ఒక అభిమాని పుస్తకం రాస్తే ఎలా ఉంటుందో చూపిస్తా...'

NTR 100TH Birth Anniversary: తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్​ ఫిల్మ్​నగర్​ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్​ కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.

NTR 100TH Birth Anniversary
ఎన్టీఆర్​ శత జయంతి ఉత్సవాలు
author img

By

Published : May 28, 2022, 1:05 PM IST

NTR 100TH Birth Anniversary: హైదరాబాద్​లో ఫిల్మ్​నగర్ రోడ్డుకు ఎన్టీఆర్​ మార్గ్​గా నామకరణం చేయాలని సినీ ప్రముఖులు కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామరావు 99వ జయంతిని పురస్కరించుకుని.. ఫిల్మ్​ నగర్​ చౌరస్తాలో ఎన్టీఆర్​ విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్​ కుటుంబసభ్యులు, బంధువులు, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​తో పాటు సినీ ప్రముఖులు పరుచూరి గోపాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొన్నారు. అనంతరం 'ఎన్టీఆర్​' పుస్తకాన్ని దగ్గుబాటి పురందేశ్వరి, పరిటాల సునీత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్​తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఫిల్మ్ నగర్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం లేకపోవడం బాధ కలిగించేదని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​ అన్నారు. వందేళ్ల తర్వాత అయినా ఆయన విగ్రహాన్ని పెట్టుకోవడం ఆనందంగా ఉందనన్నారు. ఫిల్మ్ నగర్ రోడ్డుకు ఎన్టీఆర్ మార్గ్ పేరు పెట్టేందుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.

ఎన్టీఆర్​ శత జయంతి ఉత్సవాలు

'ఆయన కారణంగా రాజకీయంగా, సినిమా రంగంలో ఎంతో మంది ఉన్నత స్థితిలో ఉన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ఎన్టీఆరే శ్రీకారం చుట్టారు. ఆయన చేసినా ఒక చరిత్రగా ఉండేది.' -మాగంటి గోపీనాథ్​, జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే

తమ అన్నదమ్ములకు పరుచూరి బ్రదర్స్​ అని పేరు పెట్టింది ఎన్టీఆర్​ అని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. రాజకీయాల్లో ఎన్నో గొప్ప పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఎన్టీఆర్‌పై తాను రచించే పుస్తకం చివరిదని వెల్లడించారు. ఒక అభిమాని పుస్తకం రాస్తే ఎలా ఉంటుందో చూపిస్తానని స్పష్టం చేశారు.

'ఒక అభిమాని పుస్తకం రాస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. నేను రాసే ఆఖరి పుస్తకం ఎన్టీఆర్‌దే అవుతుంది. పరుచూరి బ్రదర్స్ అని పేరు పెట్టింది ఎన్టీఆరే. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన ఎన్నో గొప్ప పథకాలు ప్రవేశపెట్టారు. ఆయన పేరులోని మూడక్షరాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు.' -పరుచూరి గోపాలకృష్ణ, సినీ నటుడు

ఇవీ చదవండి: 'తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం ఎన్టీఆర్'

జూనియర్​ ఎన్టీఆర్​ భావోద్వేగ ట్వీట్​.. ' ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా'​

ఆ చిత్రాలే ఎన్టీఆర్​ను కలల రాకుమారుడిని చేశాయి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.