అక్రమ అరెస్టులపై ఎన్ఎస్యూఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... గాంధీ భవన్ ముందు దిష్టిబొమ్మను దహనం చేశారు.
రాష్ట్రంలో పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేయడాన్ని నిరసిస్తూ... ప్రగతి భవన్ ముట్టడించిన ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపడాన్ని వారు ఖండించారు. నాయకులను బేషరతుగా విడుదల చేయకపోతే... పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.