ETV Bharat / state

ప్రవాస భారతీయ మహిళల కోసం... ప్రత్యేక భద్రత - ప్రవాస భారతీయ మహిళల కోసం

నగరంలో ప్రవాస భారతీయ మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం భద్రతను పెంచుతోంది. మహిళల రక్షణకై ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

ప్రవాసుల కోసం... ప్రత్యేక భద్రత
author img

By

Published : Jul 17, 2019, 9:28 PM IST

ప్రవాస భారతీయ మహిళల భద్రత కోసం ప్రత్యేక కార్యాలయాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. లక్డీకాపూల్​లోని మహిళా భద్రతా విభాగం కార్యాలయంలోనే ప్రత్యేక సెల్​ను కేటాయించారు. హైదరాబాద్​లోని 14 రాయబార కార్యాలయాలకు చెందిన ప్రతినిధులతో పాటు విదేశీ వ్యవహారాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ కమిషనరేట్ల పరిధిలోని మహిళా పోలీస్ స్టేషన్లకు చెందిన ఇన్​స్పెక్టర్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

ప్రవాస భారతీయ మహిళల కోసం... ప్రత్యేక భద్రత

ప్రవాస భారతీయ మహిళల రక్షణ కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొని తోడ్పాటునందిస్తామని హామీ ఇచ్చారు. విదేశాల్లో ఉంటూ భర్త నుంచి వేధింపులు ఎదుర్కొనే మహిళలకు తగిన న్యాయ సాయం అందించే విధంగా ఈ విభాగం పనిచేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. విదేశాల్లో ఉండే చట్టాలకు అనుగుణంగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలని డీజీపీ అధికారులను కోరారు. మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతిలక్రా, పాస్ పోర్ట్ ప్రాంతీయ కార్యాలయ అధికారి విష్ణవర్దన్ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి : "ప్రతి ఒక్కరు ట్రాఫిక్​ నిబంధనలు పాటించాలి"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.