Jobs In Health Department: తెలంగాణ ప్రభుత్వం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. వైద్యారోగ్య శాఖలో 1,326 ఉదోగ్యాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్‌లో 751 సివిల్ అసిస్టెంట్ సర్జన్, వైద్య విద్య డైరెక్టరేట్‌లో 357 ట్యూటర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 211 సివిల్ సర్జన్ జనరల్, ఐపీఎంలో 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 15 నుంచి ఆగస్టు 14 వరకు ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది.
ఇదీ చూడండి: