ETV Bharat / state

నిరుద్యోగులకు గుడ్​న్యూస్.. న్యాయశాఖలో 2,054 పోస్టుల భర్తీ

Judicial jobs notification in Telangana: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే టీఎస్​పీఎస్సీ నుంచి గ్రూప్-1, గ్రూప్-2 , గ్రూప్-3, గ్రూప్-4 మొదలగు నోటిఫికేషన్లు రాగా తాజాగా న్యాయశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్​ విడుదల చేసింది. రాష్ట్రంలో వివిధ కోర్టుల్లో ఉన్న ఖాళీ పోస్టులకు సంబంధించి హైకోర్టు 2023 వార్షిక క్యాలెండర్‌ను కూడా విడుదల చేసింది.

Judicial Department
Judicial Department
author img

By

Published : Jan 5, 2023, 6:53 AM IST

Judicial jobs notification in Telangana: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో జడ్జీలు, స్టెనోలు, ఎగ్జామినర్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, రికార్డ్‌ అసిస్టెంట్లు, ఆఫీస్‌ సబార్డినేట్‌ సిబ్బంది నియామకానికి హైకోర్టు 2023 వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేసింది. ప్రత్యేకంగా ఆఫీస్‌, సాంకేతిక సిబ్బంది నియామకాలకు 8 నోటిఫికేషన్లు జారీ చేసింది. 2022 డిసెంబరు 31 నాటికి జిల్లా జడ్జీలు, సీనియర్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జీలకు సంబంధించి మంజూరైన పోస్టులు 560 కాగా.. 410 మంది పనిచేస్తున్నారు.

మరో 150 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా జడ్జీల ఖాళీల్లో 25 శాతం పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా.. మిగతావి పదోన్నతులతో భర్తీ చేయనున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్‌ జారీ చేసి, జూన్‌లో రాత పరీక్ష, సెప్టెంబరులో ఇంటర్వ్యూలు నిర్వహించి ఫలితాలను సెప్టెంబరులోనే ప్రకటించనున్నట్లు వెల్లడించింది. అక్టోబరు 31 నుంచి కొత్త జడ్జీలు విధుల్లో చేరేలా ప్రణాళికను వెల్లడించింది.

జ్యుడిషియల్‌, మినిస్టీరియల్‌ సబార్డినేట్‌ సర్వీసులకూ..: జిల్లా కోర్టుల్లో ఉన్న 1904 జ్యుడిషియల్‌, మినిస్టీరియల్‌ సబార్డినేట్‌ సర్వీసు పోస్టులను ఆయా జిల్లా జడ్జీలు భర్తీ చేస్తారని హైకోర్టు పేర్కొంది. జూనియర్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఎగ్జామినర్లు, రికార్డ్‌ అసిస్టెంట్లు, ప్రాసెస్‌ సర్వర్లు, ఆఫీస్‌ సబార్డినేట్ల పోస్టులకు మార్చిలోగా నియామక ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపింది. 33 జిల్లాల్లోని కోర్టులతోపాటు నగరంలోని సిటీ సివిల్‌ కోర్టు తదితరాల్లో ఉన్న ఖాళీలను విడివిడిగా గుర్తించింది. వీటితోపాటు స్టెనోగ్రాఫర్లు, టైపిస్టులు, కాపీయిస్ట్‌ల పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.