ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల కారణంగా రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నాయి. లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన పనులను చక్కబెట్టుకునేందుకు ప్రజలు పెద్దఎత్తున కార్యాలయాలకు చేరుకుంటున్నారు. ఈ కారణంగా నగరంలో పలు చోట్ల రోడ్ల మీద వాహనాలు భారీగా నడుస్తున్నాయి.
హైదరాబాద్లో ట్రాఫిక్కు సైతం పలు సడలింపులు ఇవ్వగా... రోడ్లపై వాహనాల రాకపోకలు జోరందుకున్నాయి. నారాయణగూడ తదితర ప్రాంతాల్లోని ఫ్లై ఓవర్లను తెరిచారు. ఫలితంగా నగరంలో అక్కడక్కడా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.