హైదరాబాద్ అబిడ్స్‌లోని జీహెచ్ఎంసీ పార్కింగ్ భవనంలోని రెండు లిఫ్టులు పనిచేయడం లేదు. ఈ క్రమంలో వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు, కార్పొరేషన్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ముషీరాబాద్, అంబర్పేట్, గోషామహల్ నియోజకవర్గాల.. జీహెచ్ఎంసీ కార్యాలయాలు 4, 5, 6, 7 అంతస్తుల్లో ఉన్నాయి.
ఆయా కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చే ప్రజలు, పనిచేసే సిబ్బంది దాదాపు 15 రోజులుగా లిఫ్టు పనిచేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ కార్యాలయాల్లో కొందరు దివ్యాంగులు కూడా పని చేస్తున్నారు. ఆయా కార్యాలయాలకు వచ్చి మూడో అంతస్తులో వాహనాలను పార్కింగ్ చేసి 4, 5, 6, 7 అంతస్తుల్లోని కార్యాలయాలకు వెళ్లడానికి నానా తంటాలు పడుతున్నట్లు ప్రజలు, దివ్యాంగులైన సిబ్బంది చెబుతున్నారు.
ఆర్థిక సంవత్సరం నేపథ్యంలో ఆదివారం కూడా తాము పరిష్కారం అనే అంశంపై ఆఫీసుకు వస్తున్నామని వికలాంగ ఉద్యోగులు తెలిపారు. లిఫ్ట్ పనిచేయడం లేదనే విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. స్పందన కరువైందని వారు వాపోయారు. సుదీర్ఘకాలంగా ఉన్న రెండు లిఫ్టుల్లో ఒక లిఫ్ట్ మాత్రమే పనిచేస్తోందని.. ఆ లిఫ్ట్ కూడా గత 15 రోజులుగా మొరాయించిందని వారు చెప్పారు. ఇకనైనా సంబంధిత ఉన్నతాధికారులు ఈ లిఫ్ట్‌ను బాగు చేయించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి : రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ సర్వే: సీఎం కేసీఆర్