ETV Bharat / state

No Unity in Telangana Congress : ఏఐసీసీ ఇంచార్జ్, కార్యదర్శుల తీరుపై కాంగ్రెస్ హైకమాండ్ ఆరా.. - కాంగ్రెస్‌ను బలోపేతం చేయాల్సిన ఏఐసీసీ నాయకులు

No Unity in Telangana Congress : కాంగ్రెస్‌ను బలోపేతం చేయాల్సిన ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్​లు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. పార్టీకి రెండు కళ్లుగా చెప్పుకునే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కులకు తెలియకుండానే పొత్తులు, కలయికలు, చర్చలు చేస్తుండడంతో తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్, ఇంచార్జీ కార్యదర్శులు భిన్న వైఖరితో నడుచుకుంటూ విమర్శలకు తావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయ్యాల్సిన వీరు హైదరాబాద్​కే పరిమితం అవుతున్నారన్న విమర్శలను మూటగట్టుకోవడంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఆరాతీస్తున్నట్లు తెలుస్తోంది.

Telangana Congress Party
Lack of Unity in Telangana Congress Party
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2023, 10:27 AM IST

Updated : Sep 1, 2023, 1:29 PM IST

No Unity in Telangana Congress రాజకీయంగా పుంజుకుంటున్నా.. కాంగ్రెస్ చేతులు కలవడం లేదుగా

No Unity in Telangana Congress : కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటూ వస్తోంది. క్రమంగా జనాదరణ పెరుగుతున్న కాంగ్రెస్‌ని మరింత బలోపేతం చేసే దిశలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే(Manik Rao Thackrey), ముగ్గురు ఇంచార్జ్ కార్యదర్శులు పని చేయాల్సి ఉంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy), సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతో చర్చించి కార్యక్రమాలు రూపకల్పన చేసి ప్రణాళికాబద్ధంగా అమలయ్యేట్లు చూడాల్సి ఉంది. కానీ తెలంగాణలో ఆ దిశగా కార్యాచరణ, కార్యక్రమాలు జరగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అంతకు ముందు రాష్ట్ర ఇంచార్జ్ కార్యదర్శులుగా ఉన్న బోసురాజు కర్ణాటక మంత్రి పదవి చేపట్టడం, మరో కార్యదర్శి జావిద్​పై ఆరోపణలు రావడంతో తొలగించి వారి స్థానంలో మన్సూర్ అలీఖాన్, విష్ణునాథ్‌లను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఇంఛార్జ్ కార్యదర్శుల్లో ముందు నుంచి ఉన్న రోహిత్ చౌదరిని కొనసాగించారు.

Telangana Congress Controversy : రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్​గా బాధ్యతలు నిర్వర్తించే నాయకులు పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతలను కలుపుకొని పార్టీ కార్యక్రమాలను రూపకల్పన చేస్తూ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే దిశలో ముందుకు వెళ్లాల్సి ఉంది. అదేవిధంగా ఇంచార్జ్ కార్యదర్శులుగా ఉన్న ముగ్గురు తమకు కేటాయించిన ప్రాంతంలో నెలలో కనీసం 15 రోజులు ఉండి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, నాయకుల మధ్య సమన్వయం ఉండేటట్లు చూడడం లాంటివి చూడాల్సి ఉంది. కొత్తగా నియామకమైన మన్సూర్ అలీఖాన్, విష్ణునాథ్‌లు ఒకట్రెండు నియోజకవర్గాలలో పర్యటించి సమీక్షలు నిర్వహించారు. కానీ ముందునుంచి ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శిగా ఉన్న రోహిత్ చౌదరి మునుగోడు ఉపఎన్నికలు మినహా క్షేత్ర స్థాయికి వెళ్లిన దాఖలాలు లేవని, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేని అంటి పెట్టుకుని ఉంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

Congress Leaders Meeting Tummala Nageswara Rao : తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్‌రెడ్డి

Lack of Coordination in Telangana Congress : ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి. ఎన్నికల సమయంలో తేనెతుట్టె లాంటి మండల కమిటీల ఏర్పాటును వీరు భుజానికెత్తుకున్నారు. పీసీసీ, సీఎల్పీలకు తెలియకుండానే మాణిక్​రావ్ ఠాక్రే , రోహిత్ చౌదరిలు దాదాపు 600 మండలాలకు అధ్యక్షులను నియమించారు. పార్టీకి దూరంగా ఉన్న కొందరు నేతల్ని కలిసేందుకు వెళ్లేటప్పుడు కూడా పీసీసీ, సీఎల్పీలకు సమాచారం ఇవ్వలేదని తెలిసింది. మందకృష్ణ మాదిగ, ఆర్‌.కృష్ణయ్యలను కలిసినప్పుడు కూడా ఇలాగే జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కనీసం స్థానిక వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్​కు, స్థానిక డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్​కు గానీ సమాచారం లేదు. ఇక్కడ కూడా పీసీసీ, సీఎల్పీలతో కలిసి వెళ్లాల్సి ఉండగా కనీసం సమాచారం కూడా ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి.

ఇటీవల సీపీఐ నాయకులను పిలిపించుకొని ఠాక్రే, రోహిత్ చౌదరిలు పొత్తులపై చర్చలు జరిపారు. పీసీసీకి, సీఎల్పీలకు తెలియకుండానే మంతనాలు జరపడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. పార్టీకి రెండు కళ్లుగా ఉన్న పీసీసీని, సీఎల్పీని ఎందుకు కలుపుకొని పోకుండా దూరంగా పెడుతూ ఏఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎన్నికల సమయంలో చేయాల్సిన పని పక్కన పెట్టి.. ఏఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోవడం పార్టీ అధిష్ఠానం దృష్టికి వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అతని పని తీరు పార్టీకి ముప్పే : మరొకవైపు కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త బృందం... రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలపై తరచూ నివేదికలు ఇవ్వడం సర్వసాధారణం. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఠాక్రే వ్యవహరిస్తున్న తీరు పార్టీకి నష్టం కలిగించేటట్లుగా ఉందని, పార్టీలో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న విషయం అధిష్ఠానం దృష్టికి ఆ బృందం తీసుకెళ్లింది.

ఈ నేపథ్యంలోనే రెండు రోజుల కిందట రాష్ట్ర వ్యవహారాలు ఇంచార్జ్ ఠాక్రే , రోహిత్ చౌదరి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ... పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టిలు లేకుండా నేరుగా ఎవరితో చర్చలు జరిపే అధికారం తమకు లేదని తెగేసి చెప్పారు. పార్టీలో విమర్శలు తీవ్రం కావడంతోనే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికైనా పార్టీకి నష్టం కలిగించే తీరులో కాకుండా బలోపేతం చేసే దిశగా అటు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఇటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర సీనియర్ నాయకులను కలుపుకొని ఏకతాటిపై నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సమయంలో నాయకులంతా కలిసికట్టుగా ఉన్నారన్న సంకేతాలను క్షేత్రస్థాయిలోకి పంపేటట్లు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్రావు ఠాక్రే, ఇంచార్జ్ కార్యదర్శుల కార్యాచరణ ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం ఆశిస్తున్నారు.

Congress PEC Meeting Postponed : సెప్టెంబర్​ 2న జరగాల్సిన కాంగ్రెస్ PEC సమావేశం వాయిదా

Last Updated : Sep 1, 2023, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.