ETV Bharat / state

ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దు: ఆషురెడ్డి - Dr. Care-Kovid Care Online Medical Services in hyderabad

డాక్టర్‌ కేర్‌ హోమియోపతి ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా డాక్టర్‌ కేర్‌-కొవిడ్‌ కేర్‌ ఆన్‌లైన్‌ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ సేవలకు సంబంధించిన గోడ పత్రిక, మందులను హైదరాబాద్‌లో వర్ధమాన సినీనటి ఆషురెడ్డి ఆవిష్కరించారు.

డాక్టర్‌ కేర్‌-కొవిడ్‌ కేర్‌ ఆన్‌లైన్‌  వైద్య సేవలు

author img

By

Published : Apr 28, 2021, 2:46 AM IST

కరోనా విలయతాండవం చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని.. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని వర్ధమాన సినీ కథానాయిక ఆషురెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌ ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకొని డాక్టర్‌ కేర్‌ హోమియోపతి ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా డాక్టర్‌ కేర్‌-కొవిడ్‌ కేర్‌ ఆన్‌లైన్‌ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ సేవలకు సంబంధించిన గోడ పత్రికను, మందులను హైదరాబాద్‌లో నటి ఆషురెడ్డి ఆవిష్కరించారు. డాక్టర్‌ కేర్‌ హోమియోపతి డైరెక్టర్‌ ఏఎం.రెడ్డి, సంస్థ సీఈవో పి.సృజన, డాక్టర్ సారికా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కొవిడ్ సేవలో ప్రివెంటివ్, క్యూరిటీవ్, పోస్ట్ కొవిడ్ కేర్ అనే మూడు విభాగాలుగా సేవలను అందుబాటులోకి తెచ్చామని డాక్టర్ హోమియోపతి ఎండీ డాక్టర్ ఏఎం.రెడ్డి తెలిపారు. ఇందులో పోస్ట్ కొవిడ్​లో 90 రోజుల కోర్సు ఉంటుందని.. దీని ద్వారా కరోనా ద్వారా వచ్చే దీర్ఘకాలిక సమస్యలు రాకుండా ఉంటాయన్నారు. ఇక క్యూరిటీవ్​లో ఆన్​లైన్ ద్వారా డాక్టర్లు బాధితులకు అందుబాటులో ఉంటారని.. 21 రోజుల కోర్సులో మందులను అందిస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్​లలో వారం రోజుల పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం 20 లక్షల డోసులను సిద్ధం చేశామని వివరించారు.

ఇదీ చదవండి: 'కొవిడ్​ రెండో దశ వ్యాప్తికి కేంద్రమే కారణం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.