డిగ్రీ కాలేజ్ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు తొలగించారని, ఇప్పడు సినిమా చాలా బాగుందని తల్లిదండ్రుల సంఘం, ఎస్ఎఫఐ నేతలు తెలిపారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. ప్రేమికులు, తల్లిదండ్రుల మధ్య జరిగే సంఘర్షణ కళ్లకు కట్టినట్లు దర్శకుడు చిత్రీకరించారని రాష్ట్ర తల్లి దండ్రుల సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మినారాయణ వివరించారు. కుల దురహంకార హత్యలు నేడు ఏ విధంగా జరుగుతున్నాయో... వాటి ఫలితాలు భవిష్యత్తులో ఎలా ఉండనున్నయో ఆయా సందేశాలను చిత్రంలో చూపించారని తెలిపారు. ప్రధానంగా కులాంతర వివాహాలను ప్రోత్సహించారని అన్నారు. విద్యార్థుల ఉత్సాహంతో కూడిన సన్నివేశాలతో ఈ సినిమా చిత్రీకరించారని... వ్యవహార శైలి బాగుందని ఎస్ఎఫ్ఐ నేత శృతి చెప్పారు.
ఇవీ చూడండి : 'మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి'