దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లకు నేటితో సరిగ్గా ఏడేళ్లు పూర్తయ్యాయి. 2013 ఫిబ్రవరి 21న సాయంత్రం 6.45 నిమిషాలకు పేలుళ్లు సంభవించాయి. ఆ ఘటనలో 17 మంది అమాయక ప్రజలు మృతి చెందగా, వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుళ్లలో చనిపోయిన వారికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పొరేటర్ భవాని ప్రవీణ్, గూగుల్ చాట్ బాధితుడు రహీం ఈరోజు నివాళులు సమర్పించారు.
ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థ జరిపిన పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆ శిక్ష ఇప్పటి వరకూ అమలు కాలేదు. దానిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చనిపోయిన, క్షతగాత్రుల కుటుంబాలు తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : పుట్టినరోజు పార్టీలో హుక్కా .. దొరికిపోయిన నలుగురు..