ETV Bharat / state

మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదు : మంత్రి హరీశ్ - Congress

తెలంగాణ రాష్ట్ర రైతు విధానం దేశానికే ఆదర్శమని... ఈ విషయంపై ఏ రాష్ట్రంలోనైనా పరిశీలించేందుకు తాము సిద్ధమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కరోనా విపత్తు సంభవించినా రాష్ట్రానికి కేంద్రం తగిన సాయమే చేయలేదని మంత్రి హరీశ్ విస్మయం వ్యక్తం చేశారు.

మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదు : మంత్రి హరీశ్

author img

By

Published : May 6, 2020, 7:07 PM IST

తెలంగాణ ప్రభుత్వ రైతు విధానం దేశానికే ఆదర్శమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్, భాజపా పాలిత రాష్ట్రాల్లో రైతుల కోసం ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. రుణమాఫీ కోసం రూ.1,200 కోట్లు విడుదల చేశామని మంత్రి పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల్లో‌ కూడా కేంద్రం సాయమేం‌ అందించలేదని విస్మయం వ్యక్తం చేశారు. రూ. 25 వేల రుణాలను ఒకేసారి మాఫీ చేస్తామన్నారు.

రుణమాఫీ కోసం ఆర్థికశాఖ‌ రూ.1,200 కోట్లు విడుదల చేసిందని వెల్లడించిందన్నారు. 5.85 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రైతుల‌ కోసం పనిచేస్తున్న సీఎంపై ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో‌ ఏం ఉద్ధరించారో‌ చెప్పాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రానికైనా వెళ్లి పరిశీలించడానికి తాము సిద్ధమన్నారు. మద్దతు ధరకు అన్ని పంటలు‌ కొంటున్న ఏకైక‌ రాష్ట్రం తెలంగాణ అని ఆయన వివరించారు.

కేంద్రం వినతుల్ని పట్టించుకోవట్లేదు...

కర్ణాటకలో ధాన్యం రూ.1500లకు కొంటే మేము రూ.1835కి కొంటున్నామన్నారు. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని పేర్కొన్నారు. భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 24 గంటలు విద్యుత్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. రైతులను కాంగ్రెస్, భాజపా పార్టీలు మోసం‌ చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం‌ చేయాలన్న సూచనను కేంద్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచాలని కోరినా కేంద్రం స్పందించలేదన్నారు. ఏప్రిల్ నెలలో రూ.2,300 కోట్లు కోత పెట్టారని.. జీఎస్టీ,‌ ఐజీఎస్టీ బకాయిలు ఇవ్వలేదని గుర్తు చేశారు. దీక్ష పేరిట ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని హారీశ్ ఆందోళన వ్యక్తం చేశారు. మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు ఎవరికీ‌ లేదని మంత్రి హారీశ్ అన్నారు.

ఇవీ చూడండి : సీఎంకు కృతజ్ఞతలు చెబుతూ మందుబాబు ఆనందం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.