దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థలతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో హైదరాబాద్ ఐఐటీ (IIT) మినహా ఒక్కటి మొదటి పదింటిలో చోటు దక్కించుకోలేకపోయాయి. హైదరాబాద్ ఐఐటీ ఇంజినీరింగ్ విభాగంలో 8వ ర్యాంకులో నిలిచింది. వరంగల్ నిట్‌కు 19వ ర్యాంక్, హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ 43వ స్థానంలో నిలిచాయి.
హైదరాబాద్ జేఎన్టీయూ (JNTU) 57.. కేఎల్ (KL) వర్సిటీ 58 ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాల 88వ ర్యాంకుల్లో ఉన్నాయి. యూనివర్సిటీ విభాగంలో హైదరాబాద్ యూనివర్సిటీ ఆరో ర్యాంకులో నిలిస్తే... ఉస్మానియా వర్సిటీ 29, హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ 78 ర్యాంకు సాధించాయి. మేనేజ్‌మెంట్ విభాగంలో హైదరాబాద్ ఐసీఎఫ్ఏఐ (ICFAI) 25వ ర్యాంకులో నిలిస్తే...హైదరాబాద్ మేనేజ్‌మెంట్ కాలేజీ 61, ఫార్మసీ విభాగంలో హైదరాబాద్ ఎన్ఐపీఈఆర్ (NIPER) ఐదో ర్యాంకులో నిలిచాయి. కాలేజీ విభాగంలో హైదరాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల 73వ ర్యాంక్ సాధించాయి.
క్రమసంఖ్య | విద్యాసంస్థ | ర్యాంకు |
1. | హైదరాబాద్ ఐఐటీ ఇంజినీరింగ్ విభాగం | 8 |
2. | వరంగల్ నిట్ | 19 |
3. | హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ | 43 |
4. | హైదరాబాద్ జేఎన్టీయూ | 57 |
5. | కేఎల్ వర్సిటీ | 58 |
6. | ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాల | 88 |
క్రమసంఖ్య | యూనివర్సిటీ విభాగం | ర్యాంకు |
1. | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ | 6 |
2. | ఉస్మానియా వర్సిటీ | 29 |
3. | హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ | 78 |
క్రమసంఖ్య | మేనేజ్‌మెంట్ విభాగం | ర్యాంకు |
1. | హైదరాబాద్ ఐసీఎఫ్ఏఐ | 25 |
2. | హైదరాబాద్ మేనేజ్‌మెంట్ కాలేజీ | 61 |
- ఫార్మసీ విభాగంలో ఐదో ర్యాంకు సాధించిన హైదరాబాద్ ఎన్ఐపీఈఆర్ (NIPER)
- కాలేజీ విభాగంలో 73వ ర్యాంక్ సాధించిన హైదరాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల
ఇదీ చదవండి: DALITHA BANDHU: వాసాలమర్రి లబ్ధిదారులకు దళితబంధు నగదు డిపాజిట్