ఏ రంగలోనైనా.. ఏ విజయానికైనా... ఉన్నతికైనా సరే అడ్డదారులు ఉండవని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(niranjan reddy comments) అన్నారు. అడ్డదారుల్లో ఉన్నతంగా ఎదగలేమని... జీవించలేమని స్పష్టం చేశారు. దేనికైనా అవిశ్రాంతంగా కష్టపడాల్సిందేనని సూచించారు. కష్టానికి మించిన ఏ ప్రత్యామ్నాయం లేదని చెప్పారు.
"మీ ప్రవర్తన మీకు చాలా పెద్ద పెట్టుబడి. మీ నడవడిక మీకు చాలాపెద్ద మార్గదర్శి. రెండు రోజులు లేటైనా కానీ ఒక్కసారి మీరు అనుకున్న పద్ధతిలో అడుగులు వేశారంటే చాలా పటిష్ఠమైన పునాది పడుతుంది. మొదలుపెట్టినప్పుడు ఇది మామూలుగానే అనిపిస్తుంది. అందులో ఒకసారి చేరిన తర్వాత ఏమేమి వింతలు చేయవచ్చో అర్థమవుతుంది. వంద రకాల ఆలోచనలు చేయవచ్చు. డిమాండ్ ప్రజల అవసరాలను పెంచుతుంది. ఎక్కడికక్కడ ప్రజల అవసరాలను పెంచితే... ఆటోమేటిక్‌గా అక్కడ తగిన వ్యాపారం పెరుగుతుంది. ఇది మౌలిక సూత్రం. మొత్తం వచ్చి హైదరాబాద్ మీద పడితే హైదరాబాద్ అందరికీ అవకాశాలు కల్పించే పరిస్థితి ఉండదు కదా. గ్రామీణ ప్రాంతాలు కూడా గొప్పగా జీవించగలగాలి కదా. అక్కడి ప్రజలకు కూడా వసతులు అవసరం కదా. వాళ్ల అవసరాలు కూడా తీరాలి. అవన్నీ జరగాలంటే అక్కడ కూడా కార్యకలాపాలు విస్తరించాలి"
-నిరంజన్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
ప్రవర్తన, నడవడికే విజయానికి ఓ పెద్ద పెట్టుబడి అని మంత్రి(Niranjan reddy comments) అన్నారు. క్షేత్రస్థాయిలో ఆగ్రోస్ సేవా కేంద్రాలకు వచ్చే రైతులతో మర్యాదగా మాట్లాడుతూ... అవసరమైన సూచనలు, సలహాలు అందించడం ద్వారా మనసులు గెలుచుకోవాలని నిర్వాహకులకు సూచించారు. వ్యవసాయ రంగం, రైతుల బలోపేతం కోసం మీ వంతు కృషి చేయాలని మంత్రి నిరంజన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.
అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ కొత్తగా ఆలోచించగలగాలి. ధీరాబాయ్ అంబానీ పదోతరగతి చదివారు. అరవై డెబ్బై రూపాయలతో వ్యాపారం మొదలు పెట్టారు. ఇవాళ ప్రపంచ కుబేరుల్లో వాళ్ల కుటుంబం ఉంది. రామోజీరావుది కూడా మీకు ఉదాహరణ చెప్పిన. అది చాలా పెద్ద ఉదాహరణ. మామూలు విషయం కాదు. ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక వ్యవస్థను తయారుచేయడానికి ఎంతో కష్టం ఉంటుంది. ఎంతోమంది ఇన్వాల్మెంట్ ఉంటుంది. అలా ఏ విజయం వెనుక అయినా సరే కష్టం, శ్రద్ధ, కమిట్మెంట్ ఉంటుంది.
-నిరంజన్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
ఇదీ చదవండి: