హైదరాబాద్ నాంపల్లిలోని నిలోఫర్ ఆసుపత్రిలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. స్టాఫ్‌నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లుగా గత 15 ఏళ్లుగా పనిచేస్తున్న తమను ప్రభుత్వం గుర్తించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్- 19 ఐసోలేషన్ వార్డ్లలో ప్రాణాలు ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య, మున్సిపల్ సిబ్బంది సేవలకు జీతంలో 10 శాతం అధికంగా చెల్లిస్తామని హామీ ఇచ్చారని... కానీ పారిశుద్ధ్య కార్మికుల కంటే తమకు తక్కువ జీతం వస్తోందని వారు ఆవేదన వెలిబుచ్చారు.
15 ఏళ్లుగా పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరణ చేసి, ఒక నెల జీతాన్ని అదనంగా చెల్లించాలని... లేని పక్షంలో విధులు బహిష్కరించి ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: 'పాలమూరులో నియంత్రిత ప్రాంతాలివే'