ETV Bharat / state

మాస్కులు ఉచితం.. మాట్లాడితే నగదు మాయం - మాస్కులు పేరిట నైజీరియన్ల మోసం

క్రైస్తవ సోదరుల కోసం మాస్కులు ఉచితంగా పంపిస్తున్నామని చెప్తారు. ఆకర్షితులై మాట్లాడారంటే ఇక అంతే. వారి ఖాతాల్లో ఉన్న నగదును దోచేస్తూ... నైజీరియన్లు కొత్త పంథాలో అక్రమాలకు పాల్పడుతున్నారు.

nigerains crimes in hyderabad
మాస్కులు ఉచితం.. మాట్లాడితే నగదు మాయం
author img

By

Published : Jun 3, 2020, 11:25 AM IST

కరోనా వైరస్‌ ప్రకంపనలు సృష్టిస్తుండగా... చర్చిలు, ప్రార్థన మందిరాల్లో పని చేస్తున్న సేవకులను లక్ష్యంగా చేసుకుని నైజీరియన్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాము అమెరికాలో ఉంటున్నామని, హైదరాబాద్‌లో ఉంటున్న క్రైస్తవ సోదరులకు ఉచితంగా మాస్కులు పంపుతున్నామంటూ ఫేస్‌బుక్‌లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆకర్షితులైన వారితో వాట్సాప్‌ ద్వారా మాట్లాడుతున్నారు. మాస్కులు, శానిటైజర్లను అందరికీ ఇవ్వాలంటూ చెబుతున్నారు. సేవ చేసినందుకు ప్రతిఫలంగా డాలర్లు కూడా పంపుతున్నాం.. అంటూ నమ్మిస్తున్నారు. బాధితులు స్పందించిన వెంటనే విమానాశ్రయం నుంచి అధికారుల్లా మాట్లాడి మాస్కుల పార్సిల్‌ విడిపించుకోవాలంటూ ఫోన్లు చేసి రూ.వేలల్లో నగదు బదిలీ చేసుకుంటున్నారు.

మూసారంబాగ్‌లో ఉంటున్న జాన్‌ అనే వ్యక్తికి డొమినిక్‌ స్మిత్‌ పేరుతో నైజీరియన్‌ ఫోన్‌ చేశాడు. మాస్కులు శానిటైజర్లు పంపుతున్నానని చెప్పగా.. నిజమేనని నమ్మిన జాన్‌ అతడు సూచించిన ఖాతాల్లో రూ.1.17లక్షల నగదు జమ చేశాడు. పార్సిల్‌ ఎప్పుడు వస్తుందంటూ ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ రావడంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డొమినిక్‌ స్మిత్‌ అనే వ్యక్తి మాస్కులు పంపుతానంటూ మోసం చేసి రూ.97వేలు స్వాహా చేశాడని జూబ్లీహిల్స్‌లోని చర్చిలో విధులు నిర్వహిస్తున్న మహిళ ఫిర్యాదు చేసింది. రెండు పేర్లూ ఒకటే ఉండడంతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిందితుడి వివరాలను ఆరా తీస్తున్నారు.

ఇవీ చూడండి: కేంద్ర విద్యుత్తు చట్టంపై కేసీఆర్ గుస్సా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.