ETV Bharat / state

విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహణ.. దంపతుల అరెస్టు - ఎన్​ఐఏ తాజా వార్తలు

విదేశీ యువతుల అక్రమ రవాణా, వ్యభిచారం కేసులో హైదరాబాద్​కు చెందిన దంపతులను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. జస్టిన్​ అలియాస్​ అబ్దుల్​ సలాం, అతని భార్య శివులి ఖటూన్​లు హైదరాబాద్​తోపాటు దేశంలోని పలు నగరాలకు బంగ్లాదేశ్​ యువతులను తరలిస్తున్నట్లు ఎన్​ఐఏ గుర్తించింది.

విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహణ.. దంపతుల అరెస్టు

author img

By

Published : May 23, 2020, 11:53 PM IST

Updated : May 24, 2020, 10:12 AM IST

విదేశీ యువతుల అక్రమ రవాణా, వ్యభిచారం కేసులో హైదరాబాద్​కు చెందిన దంపతులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. బంగ్లాదేశ్ యువతులను హైదరాబాద్ సహా దేశంలోని పలు నగరాలకు తరలించి... వ్యభిచారం నిర్వహిస్తున్న జస్టిన్ అలియాస్ అబ్దుల్ సలాం, అతని భార్య శివులి ఖటూన్ ఈ వ్యభిచారం కూపంలోకి దించిన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. వారి నివాసంలో సోదాలు జరిపిన ఎన్ఐఏ ఇద్దరు బంగ్లాదేశ్ యువతులకు విముక్తి కల్గించింది.

గతంలో హైదరాబాద్ పోలీసులు ఛత్రినాకలో వ్యభిచారం గృహం నుంచి బంగ్లాదేశ్ యువతులకు విముక్తి కల్పించారు. విదేశీ మానవ అక్రమ రవాణా కావడం వల్ల కేసు ఎన్ఐఏకు బదిలీ అయింది. ఇదే వ్యవహారంలో కీలక సూత్రధారులుగా ఉన్న సలాం దంపతుల కోసం జాతీయ దర్యాప్తు సంస్థ మూడు నెలలుగా గాలిస్తోంది. శివులి ఖటూన్ బంగ్లాదేశ్ జాతీయురాలు కావడం వల్ల ఆ దేశానికి చెందిన యువతులను వ్యభిచార కూపంలోకి దించుతున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఈ మేరకు ఇద్దర్ని అరెస్టు చేశారు.

ఇదీ చూడండి : 'అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. అవినీతికి వ్యతిరేకం

Last Updated : May 24, 2020, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.