ETV Bharat / state

దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై ఆరా తీసిన ఎన్​హెచ్​ఆర్సీ - disha accused encounter

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై జాతీయ మానవ హక్కుల సంఘం విచారణ కొనసాగుతోంది. నాలుగు రోజుల పాటు హైదరాబాద్​లో పర్యటించిన బృందం ఎన్​కౌంటర్​ జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. అనంతరం నిందితుల కుటుంబ సభ్యులను, బాధిత కుటుంబ సభ్యులను కూడా విచారించింది. ఎన్​కౌంటర్​పై సైబరాబాద్ పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి పూర్తి ఆధారాలతో ఓ నివేదికను తయారుచేసినట్లు సమాచారం.

nhrc equiry about disha accused encounter
దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై ఆరా తీసిన ఎన్​హెచ్​ఆర్సీ
author img

By

Published : Dec 11, 2019, 4:07 AM IST

దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై ఆరా తీసిన ఎన్​హెచ్​ఆర్సీ

దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై స్పందించిన జాతీయ మానవ హక్కుల సంఘం ఓ బృందాన్ని హైదరాబాద్​కు పంపింది. ఈ నెల 7న నగరానికి వచ్చిన బృందం నాలుగు రోజుల పాటు ఘటనపై అన్ని వివరాలు సేకరించింది. మొదటి రోజు ఎన్​కౌంటర్​ జరిగిన స్థలాన్ని పరిశీలించిన బృందం... దిశ హత్య చేయబడ్డ తొండుపల్లి టోల్ గేట్, చటాన్​పల్లిలో ఆమెను కాల్చిన అండర్​పాస్ ప్రాంతాన్ని పరిశీలించింది. అనంతరం ఎన్​కౌంటర్ తర్వాత మహబూబ్​నగర్ ప్రభుత్వ ఆస్పత్రితో ఉన్న నలుగురి నిందితుల మృతదేహాలను పరిశీలించింది. ఆ తర్వాత మూడు రోజులు తెలంగాణ పోలీస్ అకాడమీలో ప్రత్యేక బ్లాక్ నుంచి విచారణ సాగించింది.

ఎన్​కౌంటర్​పై అనుమానాలున్నాయా?

రెండవ రోజు నిందితులు కుటుంబ సభ్యుల్లో... కుటుంబానికి ఒక్కరిని చొప్పున అకాడమీలో రహస్యంగా విచారించింది. ఈ విచారణలో ఎన్​కౌంటర్​పై వారికి ఉన్న అనుమానాలు అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా తమ వారితో కనీసం ఒక్కసారి కూడా మాట్లాడనివ్వకుండా కనీసం చూపించకుండా పోలీసులు చంపేశారనే విషయాన్ని మానవహక్కుల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం దిశ కుటుంబ సభ్యులైన తండ్రి, సోదరిలను కూడా బృందం విచారించింది. ఘటన జరగక ముందు ఉన్న పరిణామాలపై వారికి ఉన్న అనుమానాలపై ఆరా తీసింది.

పోలీసులను ప్రశ్నించిన ఎన్​హెచ్​ఆర్సీ

మూడో రోజు నిందితుల ఎన్​కౌంటర్ సమయంలో ఎదురు దాడిలో గాయపడిన నందిగామ ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లను విచారించింది. గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని స్వయంగా వెళ్లి ఎన్​కౌంటర్ జరిగిన విధానం, వారు గాయపడిన అంశాలపై సూటిగా ప్రశ్నలు వేసి వివరాలు సేకరించింది. నాలుగో రోజు ఎన్​కౌంటర్​లో పాల్గొన్న పోలీసు అధికారులను ఎన్​హెచ్​ఆర్సీ బృందం... అందుకు దారితీసిన పరిణామాలపై ఆరా తీసింది. కిడ్నాప్, అత్యాచారం, హత్య, కాల్చివేతకు సంబంధించి ఫోరెన్సిక్ ఆధారాలతో నివేదికను సైబరాబాద్ పోలీసుల బృందం ఎన్‌హెచ్‌ఆర్సీకి అందజేశారు. ఘటనాస్థలంలో దొరికిన రక్తం మరకలు, లారీ క్యాబిన్​లో దొరికిన రక్తం మరకల నివేదికలను, లారీ తిరిగిన సీసీ ఫుటేజీని ఎన్​హెచ్​ఆర్సీ బృందానికి ఇచ్చారు. అంతే కాకుండా కొత్తూరు సమీపంలో పెట్రోల్ కొనుగోలు చేసిన నిందితుల సీసీటీవీ ఫుటేజ్ తో పాటుగా అన్ని నివేదికలను ఆధారాలతో సహా సమర్పించారు.

నాలుగు రోజుల పాటు విచారించిన ఎన్​హెచ్​ఆర్సీ బృందం

దీనిపై షాద్‌నగర్, శంషాబాద్ పోలీసులను కూడా జాతీయ మానవహక్కుల కమిషన్‌ సభ్యులు విచారించారు. వీరితో పాటు ఆ రోజు నిందితులు పెట్రోల్ పోయించుకున్న బంకులో పని చేస్తున్న సర్వీస్​మెన్ ప్రవీణ్​ని పోలీస్ అకాడమీకి పిలిచి విచారించింది. పోలీసులు ఇచ్చిన ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికను కూలంకషంగా పరిశీలించిన బృందం... ఘటనకు ముందు, తర్వాత పోలీసులు సేకరించిన సీసీటీవీ ఫుటేజ్​ను పరిశీలించింది. చెన్నకేశవులు భార్య తన భర్తే ఈ దారుణానికి పాల్పడినట్టు సాక్ష్యాలు ఏంటని ప్రశ్నించడంతో దీనిపై పోలీసులను బృందం వివరణ కోరింది. నాలుగు రోజులపాటు చేసిన విచారణలో ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం దాదాపు అన్ని అంశాలపై ఓ నివేదిక తయారు చేస్తున్నట్లు సమాచారం. రేపు కూడా ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం హైదరాబాద్‌లోనే ఉండే అవకాశం ఉంది. మరో వైపు నిందితుల ఎదురుదాడిలో గాయపడి గచ్చి బౌలి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులు పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం.

దిల్లీకి వెళ్లిన సజ్జనార్​..

దిశ ఘటనలో నిందితుల ఎన్​కౌంటర్​పై రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున సైబరాబాద్ సీపీ సజ్జనార్ దిల్లీకి వెళ్ళారు. ఘటనపై పూర్తి వివరాలను అడ్వకేట్లకు వివరించారు. మరో వైపు ఇక్కడ సేకరించిన అన్ని ఆధారాల నివేదికను ఎన్​హెచ్​ఆర్సీ బృందం దిల్లీకి పంపే అవకాశం ఉంది.

ఇవీ చూడండి: నాలుగో రోజు ముగిసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణ...

TG_HYD_06_11_NHRC_4DAYS_PKG_3182400 రిపోర్టర్ నాగార్జున ( )దేశ వ్యాప్తంగా సంచలనలం సృష్టించిన దిశ అత్యాచారం, హ్యత్య ...ఎన్కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల సంఘం విచారణ కొనసాగుతోంది. నాలుగు రోజులు పాటు హైదరాబద్ లో పర్యటించిన బృందం ఘటనాస్థలాన్ని...ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని క్షున్నంగా పరిశీంచింది..అనంతరం నిందితుల కుటుంబ సభ్యులను, బాధిత కుటుంబ సభ్యులను కూడా విచారించింది..కేసు పై ఎన్కైంటర్ పై సైబరాబాద్ పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీంచి పూర్తి ఆధారాలతో ఓ నివేదికను తయరుచేనట్లు సమాచారం. వాయిస్ దిశ హత్యకేసులో నిందితుల ఎన్కౌంటర్ తో స్పందిచిన జాతీయ మానవ హక్కుల సంఘం ఓ బృందాన్ని హైదరాబాద్ కి పంపింది. ఈనె 7న నగరానికి వచ్చన బృందం నాలుగు రోజుల పాటు ఘటనపై అన్ని వివరాలు సేకరించింది. మొదటి రోజు ఎన్కౌంటర్ జరిగిన స్థలాన్ని పరిశీలించిన బృంది...దిశ హత్య చేయబడ్డ తొండుపల్లి టోల్ గేట్, చటాన్ పల్లి లో అమెను కాల్చిన అండర్ పాస్ ప్రాంతాన్ని పరిశీలించింది. అనంతరం ఎన్కౌంటర్ తర్వాత మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రితో ఉన్న నలుగురి నిందితుల మృతదేహాలను పరిశీలించింది. ఆ తర్వాత మూడు రోజులు తెలంగాణ పోలీస్ అకాడమీలో ప్రత్యేక బ్లాక్ నుంచి విచారణ సాగించింది. రెండవ రోజు నిందితులు కుటుంబ సభ్యల్లో కుటుంబానికి ఒక్కరిని చొప్పున అకాడమీలో రహస్యంగా విచారించింది..ఈ విచారణలో ఎన్కౌంటర్ పై వారికి ఉన్న అనుమానాలు అడిగి తెలుసుకున్నారు...అంతే కాకుండా తమ తమ వారితో కనీసం ఒక్కసారి కూడా మాట్లాడనివ్వకుండా కనీసం చూపించ కుండా పోలీసులు హత్య చేశారనే విషయాన్ని మానవహక్కుల సంఘం దృష్టికి తీసుకు వెళ్ళారు. అనంతరం దిశ కుటుంబ సభ్యలైన సోదరి, తల్లి,తండ్రులను కూడా బృందం విచారించింది. ఘటన జరిగక ముందు ఉన్న పరిణాలమాలపై వారికి ఉన్న అనుమానాలపై ఆరా తీసింది. వాయిస్ మూడో రోజు నిందితుల ఎన్కౌంటర్ సమయంలో ఎదురు దాడిలో గాయపడిన నందిగామ ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్ళను విచారించింది...గచ్చబౌలి లోని కేర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వారిని స్వయంగా వెళ్ళి ఎన్కౌంటర్ జరిగిన విధానం...వారు గాయపడిన అంశాలపై సూటిగి ప్రశ్నలు వేసి వివారాలు సేకరించింది. నాలుగో రోజు ఎన్కౌంటర్ పాల్గొన్న పోలీసుల అధికారులన విచారించిన బృందం..అందుకు దారితీసిన పరిణామాలు పై ఆరా తీసింది. కిడ్నాప్, అత్యాచారం, హత్య, కాల్చివేతకు సంబంధించి ఫోరెన్సిక్ ఆధారాలతో నివేదికను సైబరాబాద్ పోలీసుల బృందం ఎన్‌హెచ్‌ఆర్సీకి అందజేశారు. సంఘటన స్థలంలో దొరికిన రక్తం మరకలను, లారీ క్యాబిన్లో దొరికిన రక్తం మరకలను నివేదికలను, ఘటనా స్థలం తో పాటుగా లారీ తిరిగిన సీసీ ఫుటేజీని nhrc కి ఇచ్చారు. అంతే కాకుండా కొత్తూరు సమీపంలో పెట్రోల్ కొనుగోలు చేసిన నిందితుల సీసీటీవీ ఫుటేజ్ తో పాటుగా అన్ని నివేదికలను ఆధారాలతో సహా సమర్పించారు. దీనిపై షాద్‌నగర్, శంషాబాద్ పోలీసులను కూడా జాతీయ మానవహక్కుల కమిషన్‌ సభ్యులు విచారించారు. వీరితో పాటు ఆ రోజు నిందితులు పెట్రోల్ పోయించుకున్న బంకు లో పని చేస్తున్న సర్వీస్ మెన్ ప్రవీణ్ ని పోలీస్ అకాడమీకి పిలిచి విచారించింది. పోలీసులు ఇచ్చిన ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికను కూలంకషంగా పరిశీలించిన nhrc బృందం.....ఘటనకు ముందు, తర్వాత పోలీసులు సేకరించిన సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించింది. చెన్నకేశవులు భార్య తన భర్తే ఈ దారుణానికి పాల్పడినట్టు సాక్ష్యాలు ఏంటని ప్రశ్నించడంతో దీనిపై పోలీసులను బృందం వివరణ కోరింది. నాలుగు రోజులపాటు చేసిన విచారణలో ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం దాదాపు అన్ని అంశాలపై ఓ నివేదిక తయారు చేస్తున్నట్లు సమాచారం. రేపు కూడా ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం హైదరాబాద్‌లోనే ఉండే అవకాశం ఉంది. మరో వైపు నిందితుల ఎదురుదాడిలో గాయపడి గచ్చి బౌలి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులు పూర్తిగా కొలుకున్నట్లు సమాచారం. ఎండ్ వాయిస్ దిశ ఘటనలో నిందితుల పై రేపు సుప్రీం కోర్టులో రేపు విచారణ ఉన్నందున సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్వయంగా ఢిల్లీ కి వెళ్ళారు. ఘటనపై పూర్తి వివరాలను అడ్వకేట్లకు వివరించారు....మరో వైపు ఇక్కడ సేకరించి అన్ని ఆధారాల నివేదికను ఎన్ హెచ్ ఆర్సీ బృందం ఢిల్లో కి పంపే అవకాశం ఉంది..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.