ఏపీలో పురుషోత్తపట్నం ఎత్తిపోతలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్ను ఎన్జీటీ కొట్టేసింది. పర్యావరణ అనుమతి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని గతంలోనే ఎన్‌జీటీ ఆదేశించింది. పురుషోత్తపట్నం సాగునీటి ప్రాజెక్టు కాదని, గత ఆదేశాలు రివ్యూ చేయాలని ప్రభుత్వం అభ్యర్థించింది. ఏపీ ప్రభుత్వ అభ్యర్థనను ఎన్‌జీటీ ప్రధాన ధర్మాసనం తిరస్కరించింది.
ఇదీ చూడండి: ఓటుకు నోటు కేసులో సెబాస్టియన్ డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేత