మార్చి నెలఖరును పదవీ విరమణ చేయాల్సిన ఉద్యోగులు మరో మూడేళ్లపాటు విధుల్లో కొనసాగనున్నారు. ప్రభుత్వోద్యోగుల వయోపరిమితిని పెంచడం వల్ల వారంతా విధుల్లోనే ఉండనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలు, ప్రభుత్వ కార్యాలయాల్లో దాదాపుగా 750 మంది వరకు మార్చి 31న పదవీవిరమణ చేయాల్సి ఉంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారు విధుల్లో కొనసాగనున్నారు.
2024 మార్చి నుంచే రిటైర్మెంట్లు ప్రారంభమవుతాయి. ప్రభుత్వ నిర్ణయంతో విరమణ సమయంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించిన భారం కూడా ప్రభుత్వానికి ప్రస్తుతానికి తప్పుతుంది. ఈ భారం ఏడాదికి 2500 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా.
ఇదీ చూడండి: రైతుల వల్లే ఆర్థిక వ్యవస్థ కొంతైనా నిలబడగలిగింది: ఉపరాష్ట్రపతి