ETV Bharat / state

ప్రియుడే అల్లుడు... విషయం తెలిసి నవవధువు ఆత్మహత్య - క్యాటరింగ్

క్యాటరింగ్​తో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ యువకుడికి సొంత కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసింది. వారిలో మార్పు రాలేదు. తల్లితో భర్త సన్నిహితంగా ఉండటం చూసిన యువతి.. చాలా సార్లు హెచ్చరించింది. అయినా వారిలో మార్పు రాలేదు. మనస్తాపం చెందిన ఆ నవవధువు ఆత్మహత్య చేసుకుంది.

newly married bride suicide at balapur Hyderabad
అత్తతో అల్లుడి వివాహేతర సంబంధం.. నవవధువు ఆత్మహత్య
author img

By

Published : Mar 14, 2020, 1:09 PM IST

Updated : Mar 14, 2020, 4:56 PM IST

హైదరాబాద్‌ బాలాపూర్‌లో నవవధువు బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు తల్లే కారణమంటూ లేఖ రాసింది. తల్లితో భర్త నవీన్ కుమార్​ వివాహేతర సంబంధం కొనసాగించడం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో పేర్కొంది. రెండు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తులో లభ్యమైన లేఖతో ఘటన వెనక గల కారణాలు వెల్లడయ్యాయి.

నవీన్ కుమార్​, యువతి తల్లి క్యాటరింగ్​ నిర్వహిస్తారు. తరచూ కలవడం వల్ల వారిరువురి మధ్య పరిచయం పెరిగింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సొంత కూతురినే ఆ యువకుడికిచ్చి నాలుగు నెలల క్రితం వివాహం చేసింది. పెళ్లి అయిన కొద్ది రోజులకే భార్యతోపాటు వచ్చి నవీన్​ అత్తమామలతో ఉంటున్నాడు.

భర్త నవీన్‌కుమార్‌ తన తల్లితో సన్నిహితంగా ఉండటం చూసిన యువతి చాలాసార్లు హెచ్చరించింది. అయినా మార్పు రాకపోవడంతో మనస్తాపం చెందిన ఆమె గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఇదీ చూడండి : 'రైతుల కన్నీరు తుడవాలన్నదే సీఎం కేసీఆర్​ లక్ష్యం'

Last Updated : Mar 14, 2020, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.